ఆత్మనిర్భార్ భారత్.. అత్యాధునిక స్వదేశీ యుద్ధ నౌక ‘హిమ్ గిరి’ ఫొటోలు

Indigenous Advanced Frigate INS Himgiri : ఆత్మనిర్భర్ భారత్ మిషన్‌లో భాగంగా భారత నేవీ కోసం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ధ నౌక ‘హిమ్ గిరి’. కోల్ కతా గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ (GRSE) నిర్మించిన 17A షిప్స్ మూడు ప్రాజెక్టులో ఇదొకటి.

డిసెంబర్ 14న మొట్టమొదటిసారి హోగ్లీ నది జలాల్లోకి హిమ్ గిరి యుద్ధ నౌక అడుగుపెట్టింది. యుద్ధ నౌక ప్రారంభోత్సవం సందర్భంగా సందర్శన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

నేవీ సంప్రదాయాలకు తగినట్టుగా యుద్ధనౌకను అందంగా అలంకరించారు. హిమ్ గిరి యుద్ధ నౌకకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా భారత విజన్ కోసం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 17A యుద్ధనౌకలను ఆవిష్కరించారు. ప్రాజెక్ట్ 17A- యుద్ధ నౌకలు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు.

డైరక్టరేట్ ఆఫ్ నేవీ డిజైన్ (సర్ ఫేస్ షిప్ డిజైన్ గ్రూపు) – DND (SSG) ఈ యద్ధ నౌకలను నిర్మించింది.

మాజాగన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (MDL), GRSE యుద్ధ నౌకలను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొన్నిఏళ్లుగా షిప్ యార్ట్‌లో GRSE లీడింగ్ చేస్తూ 100 యుద్ధనౌకలను నిర్మించింది.

నేవీ సంప్రదాయాలకు తగినట్టుగా.. అథర్వ్ వేదాలోని శ్లోకాలతో హిమ్‌గిరి యుద్ధనౌకను ప్రారంభించారు. GRSEలో అతిపెద్ద యుద్ధనౌకల్లో ఫస్ట్ గ్యాస్ టర్బ్యూన్ P17A నౌక ఒకటి..

ఈ నేవీ యుద్ధ నౌక నిర్మాణాలతో ఉద్యోగ అవకాశాలను కూడా అందిస్తోంది. ప్రాజెక్ట్ 17A నేవీ నౌకల నిర్మాణం కోసం 80శాతం మెటేరియల్, అవసరమైన సామాగ్రిని స్వదేశీ వెండర్ల నుంచే సేకరిస్తున్నారు. దీనిద్వారా భారత సంస్థలు, MSME సంస్థల నుంచి 2000 వరకు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నారు.