Telangana Govt with Kotelijent‌ : టాలెంట్ ఉంటే ఉద్యోగాలు వెతుక్కుంటు వస్తాయి : మంత్రి కేటీఆర్

టాలెంట్ ఉంటే ఉద్యోగాలు వెతుక్కుంటు వస్తాయని రాయదుర్గంలో మంత్రి కేటీఆర్‌ కోటెలిజెంట్‌ సెంటర్‌ను ప్రారంభించిన సందర్భంగా మత్రి కేటీఆర్ తెలిపారు.

Employment Opportunities Ready For Skilled Persons

Telangana Govt with Kotelijent‌ :  హైదరాబాద్ లోని రాయదుర్గంలో మంత్రి కేటీఆర్‌ కోటెలిజెంట్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతు..టాలెంట్ ఉంటే ఉద్యోగావకాశాలు వెతుక్కుంటూ వస్తాయని అన్నారు. స్థానికులకు ఉద్యోగాలిచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఉద్యోగాలు కల్పించేవారికి ప్రభుత్వం సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని తెలిపారు. విదేశీ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం చక్కటి అనువుగా ఉందని..తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు కోటెలిజెంట్‌ ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు.

కోటెలిజెంట్‌ తో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంతో వందలాది మందికి ఉద్యోగాలు వస్తాయని..ఉద్యోగాలు కల్పించే సంస్థలకు అండగా ఉండాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. యువత నైపుణ్యాలు పెంచుకోవాలని..నైపుణ్యం ఉంటే ఉద్యోగాలు వెతుక్కుంటు వస్తాయని అన్నారు.

దేశంలో ఉన్న 100 కోట్లకుపైగా ఉన్న జనాభాకు ప్రభుత్వ ఉద్యోగాలు సరిపోవనీ..అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే అవకాశం ప్రభుత్వాలకు ఉండదని..అందుకే కొత్త పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ఉపాధి కల్పించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం అదే చేస్తోందని తెలిపారు. డేటా ప్రొటెక్షన్‌ చేయాలంటే సైబర్‌ సెక్యూరిటీ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రధాని ట్విటర్‌ ఖాతా కూడా హ్యాకింగ్‌కు గురైందన్నారు. సైబర్‌ క్రైమ్‌కు సైబర్‌ సెక్యూరిటీ పెద్ద సవాల్‌గా మారిందని చెప్పారు. భవిష్యత్‌లో సైబర్‌ యుద్ధాలే జరుగుతాయని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు.