Minister Roja: జూమ్ మీటింగ్‌లో లోకేష్ ఎందుకు పారిపోయారు: మంత్రి రోజా

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు చూసి తట్టుకోలేని చంద్రబాబు, లోకేష్‌లు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు. పదో తరగతి పరీక్షల్లో తక్కువ ఉత్తీర్ణత వచ్చిందని రాజకీయం చేయడం టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనం.

Minister Roja: పదో తరగతి పరీక్షల్లో తక్కువ శాతం రిజల్ట్ వచ్చిందని రాజకీయం చేడయం టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు ఏపీ మంత్రి రోజా. శనివారం ఆమె తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ టీడీపీపై విమర్శలు చేశారు.

Baby Kidnap: చిన్నారి కిడ్నాప్ కేసులో విచారణ వేగవంతం

‘‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు చూసి తట్టుకోలేని చంద్రబాబు, లోకేష్‌లు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు. పదో తరగతి పరీక్షల్లో తక్కువ ఉత్తీర్ణత వచ్చిందని రాజకీయం చేయడం టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనం. జూమ్ మీటింగ్‌లో కొడాలి నాని, వల్లభనేని వంశీ వస్తే లోకేష్ ఎందుకు పారిపోయారు. జూమ్ మీటింగ్‌లో అడిగే అవకాశం వచ్చినా లోకేష్ ఎందుకు అడగలేదు. మేము తప్పు చేసి ఉంటే అడిగేవారు. లోకేష్‌కు అసెంబ్లీకి వచ్చి మాట్లాడే అవకాశం ఎప్పటికీ రాదు. కోవిడ్ వల్లో, సరిగ్గా చదవక పోవడం వల్లో కొందరు ఫెయిలయ్యారు. సప్లిమెంటరీలో పాసైతే వాళ్లందరికీ రెగ్యులర్‌గా పాసైనట్లుగానే సర్టిఫికెట్లు ఇస్తాం. అచ్చెంనాయుడుకు బుర్ర లేదు. ప్రతిసారీ వైసీపీని ఎన్నికలకు రమ్మని, ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకుంటే పార్టీని మూసేస్తామని అంటున్నాడు.

Covid Test: అమెరికా వచ్చే వాళ్లకు కోవిడ్ టెస్ట్ నిబంధన ఎత్తివేత

టీడీపీని ఎప్పుడు మూసేద్దామా అని ఆయన ఎదురు చూస్తున్నాడు. దీన్నిబట్టి ఆయనకు చంద్రబాబు, లోకేష్‌పై ఎంత కోపం ఉందో అర్థమవుతుంది. పవన్ కల్యాణ్ బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నాడో క్లారిటీ తీసుకోవాలి. జనసేన పెట్టింది పార్టీ కార్యకర్తల కోసమా.. జనం కోసమా అనే స్పష్టత లేదు. చంద్రబాబుకు అవసరమైనప్పుడు మీటింగులు, ర్యాలీలు పెడతారు’’ అని రోజా వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు