Minister Srinivas Goud Gun Firing : ‘నేను గన్ లాక్కోలేదు..ఎస్పీయే ఇచ్చారు’..కాల్పులపై మంత్రి క్లారిటీ
తుపాకీతో గాల్లోకి కాల్పులు జరపడంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. ఎస్పీ నుంచి తాను గన్ లాక్కోలేదన్నారు. స్వయంగా ఎస్పీయే గన్ తనకు ఇచ్చారని పేర్కొన్నారు. అది దమ్మీ, బ్లాంక్ గన్, బుల్లెట్లు ఉండవు అని అన్నారు.
- bheemraj
- Published On : August 13, 2022 / 06:30 PM IST
Minister Srinivas Goud Gun Firing
Minister Srinivas Goud Gun Firing : ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పోలీసుల తుపాకీ తీసుకుని గాలిలోకి కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపుతోంది. తుపాకీతో గాల్లోకి కాల్పులు జరపడంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. ఎస్పీ నుంచి తాను గన్ లాక్కోలేదన్నారు. స్వయంగా ఎస్పీయే గన్ తనకు ఇచ్చారని పేర్కొన్నారు. అది దమ్మీ, బ్లాంక్ గన్, బుల్లెట్లు ఉండవు అని అన్నారు. తనకు రైఫిల్ ఎలా వాడాలో తెలుసని చెప్పారు. కొందరు కావాలనే అసత్య ప్రచారం చేశారని తెలిపారు.
మహబూబ్ నగర్ లో నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హల్ చల్ చేశారు. పోలీసుల తుపాకీ తీసుకుని గాలిలోకి కాల్పులు జరిపారు. పోలీసులకు చెందిన ఎస్ఎల్ఆర్ వెపన్ తో గాలిలోకి కాల్పులు జరిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాలుస్తున్నా.. పోలీసులు అభ్యంతరం తెలపకపోవడం గమనార్హం. అనంతరం ఆ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. మంత్రి వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భంగా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీడమ్ ర్యాలీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన సొంత జిల్లా మహబూబ్ నగర్ లో జరిగిన ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయన పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఫొటోలు, వీడియోలను చూసిన నెటిజన్లు.. పోలీసుల తుపాకీతో మంత్రి గాల్లోకి ఎలా కాల్పులు జరుపుతారంటూ ట్రోల్ చేస్తున్నారు.
