Temjen Imna Vegetables Pics : అరటి ఆకుల్లో ఆర్గానిక్ కూర‌గాయ‌లను షేర్ చేసిన మంత్రి .. నోరూరిస్తున్నాయంటున్న నెటిజన్లు

నాగాలాండ్ మంత్రి టెంజెన్ ఇనా అలంగ్..ఈయన పేరు చెబితే చక్కటి ఆరోగ్యవంతమైన హాస్యం గుర్తుకొస్తుంది. సెటైర్ ను కూడా చక్కటి ఛలోక్తిగా సంధించటంలో ఆయన దిట్ట. నాగాలాండ్ లో శాఖాహారం దొరుకుందా? అనే ప్రశ్నకు మంత్రి అరటి ఆకుల్లో ఆర్గానిక్ కూర‌గాయ‌లను షేర్ చేశారు.

Minister Temjen Imna Along vegetables

Minister Temjen Imna Along vegetables : నాగాలాండ్ మంత్రి టెంజెన్ ఇనా అలంగ్..ఈయన పేరు చెబితే చక్కటి ఆరోగ్యవంతమైన హాస్యం గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆయన స్టైలే అది. సెటైర్ ను కూడా చక్కటి ఛలోక్తిగా సంధించటంలో ఆయన దిట్ట. చక్కటి సెన్సాఫ్ హ్యూమర్‌ ఆయన స్టైల్. ఆ స్టైల్ అంటే నెటిజన్లు ఇష్టపడుతుంటారు. తన సెన్సాఫ్ హ్యూమర్ తో నెటిజ‌న్ల‌కు ఆరోగ్య‌క‌ర‌మైన హాస్యం పంచుతుంటారు నాగాలాండ్ ఉన్నత విద్య,గిరిజన వ్యవహారాల మంత్రి  టెంజెన్ ఇనా అలంగ్.

తనను నెటిజన్లు అడిగే కొన్ని కొంటె ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబులిస్తుంటారు. తాజాగా ఆయనను  నాగాలాండ్ లో శాఖాహారం దొరుకుతుందా? అంటూ వేసిన ప్రశ్నకు  ఆయన ఫోటోతో సమాధానం చెప్పారు. ఆ ఫోటోలో అరటి ఆకులో ప్యాక్ చేసిన తాజాగా నిగనిగలాడే ఆర్గానిక్ కూరగాల ఫోటోలను తన ట్విట్టర్ లో షేర్ చేశారు.

Nagaland Minister Temjen Imna : నా కళ్లు చిన్నవే కానీ.. మైలు దూరంలో ఉన్న కెమెరాను కూడా చూడగలను

ఆకు కూర‌లు,పొట్ల‌కాయ‌లు, పుట్ట‌గొడుగులు, వంకాయ‌ల వ‌ర‌కూ చ‌క్క‌గా ప్యాక్ చేసిన‌ కూర‌గాయ‌ల ఫొటోల‌ను నెటిజ‌న్ల‌తో పంచుకున్నారు. నాగాలాండ్‌లో శాకాహారం ల‌భిస్తుందా అని త‌న‌ను ఒక‌రు అడిగార‌ని ఈ పోస్ట్‌కు ఆయ‌న క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ కూర‌గాయాలు నేరుగా పొలం నుంచి వ‌చ్చాయ‌ని అందుకే ప్లాస్టిక్ బ్యాగ్‌లో కాకుండా అర‌టి ఆకుల్లో చుట్టిఉన్నాయ‌ని మంత్రి అలంగ్ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్‌కు నెటిజ‌న్ల నుంచి పెద్ద ఎత్తున స్పంద‌న ల‌భించింది. తాజా కూర‌గాయ‌లు నోరూరించేలా ఉన్నాయ‌ని ఓ యూజ‌ర్ అనగా..తాజా వెజిట‌బుల్స్‌ను చ‌క్క‌గా అర‌టి ఆకుల్లో చుట్టార‌ని మ‌రో నెటిజ‌న్ కామెంట్ చేశారు.

కాగా..ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారి ఆహారపు అలవాట్లపై జాత్యహంకార వ్యాఖ్యలు చేసినవారికి మంత్రి టెంజెన్ ఇనా అలంగ్ షేర్ చేసిన ఈ ఫోటో ధీటైన సమాధానం అని చెప్పాల్సిందే..దటీజ్ టెంజన్ ఇనా అలంగ్ అనిపించేలా ఉందీ పోస్ట్.