Expensive Mango : ఆ మామిడి పండ్ల ధర కిలో రూ.2.75 లక్షలు మాత్రమే.. ధైర్యం చేసి కొనాలంటే ధనవంతులై ఉండాలి!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు 'మియాజాకి' కిలో ధర కేవలం రూ.2.75 లక్షలు మాత్రమే. వామ్మో అనుకుంటున్నారు కదా.. పశ్చిమ బెంగాల్ లో పండే ఈ రకం మామిడిపండ్ల అంతర్జాతీయ మార్కెట్ ధర అది. ధనవంతులు తప్ప సామాన్యులు ఈ పండ్లు కొనే పరిస్థితి అయితే లేదు.

Expensive Mango Miyazaki

Expensive Mango Miyazaki : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు ఏంటో మీకు తెలుసా? పశ్చిమ బెంగాల్‌ సిలిగురిలో పండే ‘మియాజాకి’ మామిడి పండ్లు ఇంటర్నేషనల్ మార్కెట్లో కిలో రూ.2.75 లక్షలు ధర పలుకుతున్నాయి. ధర విని ఆశ్చర్యపోతున్నారా?

Overeat Mangoes : మామిడి పండ్లు అతిగా తినొద్దు!

‘మియాజాకి’ మామిడికాయల గురించి విన్నారా? బహుశా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాటి ఫోటోలు చూసే ఉంటారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు ఇది. ఈ రకం మామిడి గురించి చాలా తక్కువగా తెలుసుకునే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్‌ సిలిగురిలో జరిగిన ఒక ప్రదర్శనలో ఈ పండ్ల ఫోటోలు జనాల్ని ఆశ్చర్యానికి గురిచేశాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో ‘మియాజాకి’ మామిడి పండ్ల ధర కిలో రూ.2.75 లక్షలు. జూన్ 9న ఇక్కడ మామిడి పండ్ల ప్రదర్శన మొదలైంది. ఈ ఫెస్టివల్‌లో 262 రకాల మామిడి పండ్లను ప్రదర్శిస్తున్నారు. అయితే అన్నిట్లోకి ‘మియాజాకి’ ప్రత్యేకంగా నిలవబోతోందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పండ్లకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Mango Fruits : మామిడి పండ్లు తినటం వల్ల…. ఆరోగ్యానికి అనుకూల ఫలితాలు

‘బంగారాన్ని మరచిపోతాను.. ఈ మామిడి పండ్ల వ్యాపారానికి  పెట్టుబడి పెట్టబోతున్నాను’ అంటూ ఒకరు.. ‘ ఈ పండ్లు కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలి’ అని మరొకరు ఫన్నీగా కామెంట్లు పెట్టారు. చాలా మంది ఈ పండ్లు చూడగలరేమో.. ధైర్యం చేసి కొనాలంటే ధనవంతులై ఉండాలి మరి.