moinabad farm house MLAs trap case sit issues Once again notice to bjp leader bl santosh
Moinabad Farm House..MLAs trap case : మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్‌కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. నవంబర్ 26న లేదా 28వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బీఎల్ సంతోష్ కు మరోసారి నోటీసులు పంపాలని తెలంగాణ హైకోర్టు బుధవారం (నవంబర్ 23,2022) ఆదేశాలు జారీ చేసింది. ధర్మాసనం ఆదేశాల మేరకు మరోసారి సంతోష్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
కాగా..మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్‌కు విచారణకు రావాలతీ అయినా ఆయన విచారణకు హాజరు కాలేదు. న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఢిల్లీ పోలీసుల సహాయంతో రెండురోజుల క్రితమే సిట్ నోటీసులు జారీ చేసింది. కానీ ఆయన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉన్నందున విచారణకు రావడానికి సమయం కావాలని కోరుతూ సంతోష్ సిట్ కు లేఖ రాశారు. అయితే కోర్టు సూచనల మేరకు ఈ నోటీసు కంటే ముందే నవంబర్ 21న విచారణకు రావాలని సిట్ నోటీసులు పంపింది.
ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసును బుధవారం విచారించిన తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ కు మరోసారి 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.సహజ న్యాయసూత్రాలకు భిన్నంగా వ్యవహరించవద్దని కూడ సిట్‌కు సూచించింది తెలంగాణ హైకోర్టు. దీంతో సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు.