Partha
Teacher recruitment scam: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జరిపిన సోదాల్లో భాగంగా తన సహాయకురాలు అర్పితా ముఖర్జీ ఇళ్ళలో బయటపడిన కోట్లాది రూపాయల డబ్బు తనది కాదని పశ్చిమ బెంగాల్ తాజా మాజీ మంత్రి పార్థ ఛటర్జీ అన్నారు. ఆ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించి నగదు అక్రమ చలామణి కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు అర్పితా ముఖర్జీ ఇళ్ళలో దొరికిన నగదు రూ.49.8 కోట్లకు చేరింది.
అంతేగాక, ఇప్పుడు అర్పితా ముఖర్జీకి సంబంధించిన మూడు సంస్థల నగదు చలామణీ గురించి ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. దీనిపై పార్థ ఛటర్జీ స్పందించారు. కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం ఆయనను తరలిస్తోన్న నేపథ్యంలో ఇవాళ ఆయనను మీడియా ప్రశ్నించింది. దీంతో ఆయన మాట్లాడుతూ… తనపై ఎవరు కుట్రలకు పాల్పడుతున్నారన్న విషయంతో అన్ని అంశాలూ సరైన సమయం వచ్చినప్పుడు అందరికీ తెలుస్తుందని చెప్పుకొచ్చారు. అర్పిత ఇళ్ళలో దొరికిన డబ్బు తనది కాదని స్పష్టం చేశారు. అర్పిత ఇళ్ళలో కోట్లాది రూపాయల నగదు, బంగారం బయటపడుతుండడంతో పార్థ ఛటర్జీని మంత్రి పదవి నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తొలగించారు.
China: అందరినీ భయపెట్టిన తమ రాకెట్ శకలాలు ఎక్కడ పడ్డాయో తెలిపిన చైనా