monsoon rains బ్యాడ్ న్యూస్ : ఆలస్యంగా రుతు పవనాలు

  • Publish Date - May 16, 2020 / 03:46 AM IST

ఎండలు మరిన్ని రోజులు భరించాల్సిందే. ఎందుకంటే రుతుపవనాలు ఈసారి కూడా ఆలస్యంగా ఎంట్రీ ఇవ్వనున్నాయి. దీంతో చాలా మంది నిరుత్సాహానికి గురయ్యారు. నైరుతి రుతు పవనాలపైనే రైతులకు కీలకం. వర్షాలు పడితే..వ్యవసాయ పనులు ఊపందుకోనున్నాయి.

అయితే..దేశంలోకి ఈ ఏడాది మాన్ సూన్ కొంత ఆలస్యంగా ప్రవేశించనున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా జూన్ 01వ నాటికి కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకుతాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం జూన్ 05వ తేదీ నాటికి అటూ.ఇటూ..రావొచ్చని వాతావరణ శాఖాధికారులు అంచనా వేశారు. 

15 ఏళ్లలో 2015లో మినహాయించి..మిగిలిన అన్ని సందర్భాల్లో అంచనాలు దాదాపు నిజమయ్యాయని అధికారులు తెలిపారు. కేరళ తీరాన్ని తాకడంపైనే దేశ వ్యాప్తంగా వానలు కురవడం ఆధార పడి ఉంటుందనే సంగతి తెలిసిందే. కేరళ తీరాన్ని తాకిన అనంతరం దేశ వ్యాప్తంగా విస్తరిస్తాయి. కేరళ నుంచి కర్నాటక మీదుగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయి. 

మరోవైపు..ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారి…వచ్చే 24 గంటల్లో తుఫాన్ గా మారనుందని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. ఇది మరింత బలపడి..2020, మే 16వ తేదీ శనివారం సాయంత్రానికి తుఫాన్ గా మారి వాయువ్య బంగాళాఖాతంపై వైపు పయేనిస్తుందని తెలిపారు. దీని కారణంగా…కోస్తాంధ్ర, తమిళనాడు తీర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 

Read Here>> ఢిల్లీలో వడగళ్ల వాన: రోడ్లపై ముత్యాలు పడ్డాయా అన్నట్లుగా ఉంది

ట్రెండింగ్ వార్తలు