Congress on Parliament session: ఇంత త్వరగా పార్లమెంటు సమావేశాలు ఎందుకు ముగించారు?: కాంగ్రెస్

షెడ్యూలు కంటే నాలుగు రోజుల ముందే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగియడంతో కాంగ్రెస్ పార్టీ మండిపడింది. సమావేశాలు త్వరగా ముగించాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించింది. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ఇంత త్వరగా ముగించడంతో తాను తీవ్ర నిరాశ చెందామని అన్నారు.

Congress on Parliament session: షెడ్యూలు కంటే నాలుగు రోజుల ముందే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగియడంతో కాంగ్రెస్ పార్టీ మండిపడింది. సమావేశాలు త్వరగా ముగించాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించింది. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ఇంత త్వరగా ముగించడంతో తాను తీవ్ర నిరాశ చెందామని అన్నారు. షెడ్యూలు ప్రకారం పూర్తిస్థాయిలో సమావేశాలు నిర్వహించాలని, అన్ని అంశాలపై చర్చించాలని విపక్ష పార్టీలు భావించాయని ఆయన చెప్పారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు పార్లమెంటును విస్మరించారని అన్నారు. అన్ని అంశాలపై, బిల్లులపై ఆగస్టు 12 వరకు చర్చించాలని ప్రతిపక్ష పార్టీలు భావించాయని చెప్పారు. ఈ సమావేశాల్లో మొత్తం 32 బిల్లులను ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావించిందని, కానీ, లోక్ సభలో ఏడు, రాజ్యసభలో ఐదు బిల్లులు మాత్రమే ఆమోదం పొందాయని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు అన్ని ఏకతాటికి పైకి రావడం శుభపరిణామమని అన్నారు.

కాగా, నిన్న లోక్‌సభ, రాజ్యసభ వర్షాకాల సమావేశాలు నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే. జూలై 18 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 12 వరకు పార్లమెంట్ సమావేశాలు కొనసాగాల్సి ఉంది. అయినప్పటికీ నిన్నే వాయిదా పడ్డాయి. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, నిరుద్యోగం, అగ్నిపథ్ పథకం, ధరల పెరుగుదల, రాజ్యాంగ వ్యవస్థల, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి అంశాలపై కేంద్రాన్ని విపక్షాలు నిల‌దీశాయి.

Telangana Cabinet: ఎల్లుండి తెలంగాణ మంత్రివ‌ర్గ స‌మావేశం.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేసీఆర్

ట్రెండింగ్ వార్తలు