Telangana Cabinet: ఎల్లుండి తెలంగాణ మంత్రివ‌ర్గ స‌మావేశం.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేసీఆర్

తెలంగాణ కేబినెట్ గురువారం భేటీ కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌ నుంచి సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం జరగనుందని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఈ స‌మావేశంలో రాష్ట్రానికి అద‌న‌పు వ‌న‌రుల స‌మీక‌ర‌ణ‌తో పాటు పలు అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు.

Telangana Cabinet: ఎల్లుండి తెలంగాణ మంత్రివ‌ర్గ స‌మావేశం.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేసీఆర్

Telangana Cabinet

Updated On : August 9, 2022 / 3:45 PM IST

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ గురువారం భేటీ కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌ నుంచి సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం జరగనుందని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఈ స‌మావేశంలో రాష్ట్రానికి అద‌న‌పు వ‌న‌రుల స‌మీక‌ర‌ణ‌తో పాటు పలు అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. ఇటీవల నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎవరూ హాజరుకాలేదన్న విషయం తెలిసిందే.

అలాగే, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మరింత ధాటిగా పోరాడాలని, వైఫల్యాలను ఎండగట్టాలని టీఆర్ఎస్ సర్కారు భావిస్తోంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మునుగోడు ఎమ్మెల్యే సీటుకి ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఆయా అంశాలపై మంత్రులతో కేసీఆర్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలకు ఈ కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది.