Gujarat’s Morbi: కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటన ‘దైవ సంకల్పం’ అని న్యాయస్థానానికి చెప్పిన నిందితుడు

ఒరెవా సంస్థ మేనేజర్‌ దీపక్‌ పరేఖ్‌ స్పందిస్తూ... బ్రిడ్జి కూలిన ఘటనలో తమ తప్పేమీ లేదని అదంతా దైవ సంకల్పమని అన్నారు. అదో దురదృష్టకర ఘటన అని, ఇటువంటి ప్రమాదం జరగకుండా ఉండాల్సిందని చెప్పుకొచ్చారు. చివరకు ఈ కేసులో నలుగురు నిందితులను పోలీస్‌ కస్టడీకి, మిగతా వారిని జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.

Gujarat’s Morbi: గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటన ‘దైవ సంకల్పం’ అని న్యాయస్థానానికి ఓ నిందితుడు చెప్పారు. కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో 135 మందికిపైగా మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టైన తొమ్మిది మందిని ఇవాళ పోలీసులు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. బ్రిడ్జి పునరుద్ధరణ ప్రాజెక్టు చేపట్టిన అజంతా ఒరెవా సంస్థను జడ్జి తప్పుబట్టారు.

ఆ సంస్థకు ఈ ప్రాజెక్టు చేపట్టే అర్హత లేదని న్యాయస్థానికి పోలీసుుల చెప్పారు. 2007, 2022లో ఆ సంస్థ బ్రిడ్జి పునరుద్ధరణ పనులు చేపట్టిందని వివరించారు. బ్రిడ్జి ఫ్లోరింగ్‌ మార్చినప్పటికీ కొత్త తీగలను అమర్చలేదని చెప్పారు. దీంతో ఫ్లోర్‌ బరువును మోయలేక తీగలు తెగిపోయాయని విచారణలో తేలినట్లు వివరించారు.

అనంతరం ఒరెవా సంస్థ మేనేజర్‌ దీపక్‌ పరేఖ్‌ స్పందిస్తూ… బ్రిడ్జి కూలిన ఘటనలో తమ తప్పేమీ లేదని అదంతా దైవ సంకల్పమని అన్నారు. అదో దురదృష్టకర ఘటన అని, ఇటువంటి ప్రమాదం జరగకుండా ఉండాల్సిందని చెప్పుకొచ్చారు. చివరకు ఈ కేసులో నలుగురు నిందితులను పోలీస్‌ కస్టడీకి, మిగతా వారిని జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. బ్రిడ్జి కూలిన ఘటనపై సుప్రీం కోర్టులోనూ పిల్‌ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై ఈ నెల 14న సుప్రీంకోర్టు విచారణ జరపుతుంది. కాగా, కేబుల్ బ్రిడ్జి ఘటనలో గాయపడ్డ 100 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కొందరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..