Unique Trees : ప్రకృతి అద్భుతాలు: సిగ్గుపడే మొక్కలు, ఏడ్చే మొక్కలు,కదిలే చెట్లు

ప్రకృతితో ఎన్నో అద్భుతాలు. వింతలు..విచిత్రాలు.అటువంటి వింతల్లో సిగ్గుపడే మొక్కలు, ఏడ్చే మొక్కలు,కదిలే చెట్లు, రంగులు వెదజల్లే మొక్కలు, దాహమేస్తే నీరు ఇచ్చే మొక్కలు ఇలా ఎన్నో..

most weird and unique trees on earth :  ప్రకృతి ఎంత అందమైనదో అంతకంటే వింతైనది.కోటాను కోట్ల జీవరాశులతో పాటు అత్యద్భుతమైన మొక్కలకు ఆలవాలంగా ఈ భూమి విలసిల్లుతోంది.భూమి మీద 4 లక్షల రకాలకుపైగా జాతులకు చెందిన మొక్కలు ఉన్నాయి. అటువంటి ఈ భూమి మీద ఉండే అద్భుతమైన చెట్లు, మొక్కల గురించి తెలిస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. వాటిని ఒక్కసారైనా చూడాలనిపిస్తుంది. చూడకపోయినా వాటికి గురించి మాత్రం కచ్చితంగా తెలుసుకోవాల్సిందేననిపిస్తుంది. మరి అటువంటి అద్భుతమైన వింత చెట్లు, మొక్కల గురించి తెలుసుకుందామా..ఈ భూమ్మీద సిగ్గుపడే మొక్కలు, చీకటిలో దీపాల్లా వెలిగే మొక్కలు,దాహంతో ఉన్నవారికి దాహాన్ని తీర్చే మొక్కలు, ఒక చోటినుంచి మరోచోటికి కదిలే చెట్లు, వాటికి హాని చేసినా..నరికినా ఏడ్చే చెట్లు, ఉన్నాయని మీకు తెలుసా? బహుశా చాలా చాలామందికి తెలియక పోవచ్చు.అటువంటి వింతైన వాటి గురించి తెలుసుకుందాం..

నీటినిచ్చే మొక్కలు
భారత్‌లోని అండమాన్-నికోబార్ దీవుల్లో శాస్త్రవేత్తలు కెలెమస్ అండమానిక్స్ అనే మొక్కలను కనుగొన్నారు. ఈ మొక్క మొదళ్లలో నీరు ఉంటుంది. స్థానికులకు నీరు అవరసమైతే నీటికోసం ఈ మొక్క మొదళ్లను పెకిలించి తమ దాహాన్ని తీర్చుకుంటారట. అలాగే మరో చెట్టు..చూడటానికి అద్భుతంగా వింతగా ఉంటుంది. ఓ భారీ పిల్లర్ లాగా ఉంటుందీ చెట్టు. కింద ఎక్కడా ఒక్క ఆకు కూడా కనిపించదు. కానీ పైన మాత్రం గొడుగులాగా ఉంటుంది. దాని పేరు బావోబా. ఆఫ్రికాలో ఉంటాయి ఈ చెట్లు. ఈ బావోబా అనే చెట్టు కూడా స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది. 80 మీటర్ల ఎత్తువరకూ పెరిగే ఈ చెట్టు కాండం దగ్గర గాటు పెడితే నీరు కారుతుంది. ఈ నీటిని తాగటానికి కూడా చాలా బాగుంటాయట.

వెలుగులు వెదజల్లే మొక్కలు
ఈ భూమిపై చీకట్లో వెలుగులు వెదజల్లే మొక్కలు ఉన్నాయిని మీకు తెలుసా? కొన్ని మొక్కలపై పడిన నీటి బిందువులు రాత్రివేళ వెలుగులు విరజిమ్ముతాయి. మష్రూం (పుట్టగొడుగు) జాతికి చెందిన మొక్కలు వివిధ రంగుల్లో ఉంటూ కాంతిని ప్రసరింపజేస్తాయి. ఆక్సిజన్‌తో వివిధ రసాయనాల సమ్మేళనం కారణంగా కొన్ని మొక్కలు కాంతిని వెదజల్లుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

సిగ్గుపడే మొక్కలు..ముట్టుకుంటే ముడుచుకుంటాయ్..
సిగ్గుపడే మొక్కలు. ఈ మొక్కలతో భలే టైమ్ పాస్ చేయొచ్చు. ఏదైనా తాకితే చాలు ఈ మొక్కలు తెగ సిగ్గుపడిపోతాయి. అంటే వీటి ఆకులు ముడుచుకుపోతాయి. సాధారణంగా సిగ్గుపడే లక్షనం మనుషులకే ఉంటుంది. కానీ మొక్కలకు కూడా ఇటువంటి లక్షణం ఉంటుందని ఈ మొక్కల్ని చూస్తే తెలుస్తుంది. ఈ మొక్కలను లాజవంతి పేరుతో పిలుస్తారు. ఈ మొక్కలను మనుషులు ముట్టుకుంటే అవి ముడుచుకుంటాయి. అదేనండీ మనం అత్తిపత్తి అంటామే అటువంటి మొక్కలన్నమాట. ఈ మొక్కల గురించి శాస్త్రవేత్తలు మాట్లాడుతు..ఈ మొక్కల ఆకులు ఒక విధమైన ద్రవ పదార్థంతో నిండివుంటాయి. అందుకే వీటికి ఏవి తగిలినా అవి ముడుచుకుపోతాయి. అందుకే వీటిని సిగ్గుపడే మొక్కలు అని ముద్దుగా పిలుస్తుంటాం అని తెలిపారు.

ఏడ్చే మొక్కలు
సిగ్గు పడే మొక్కల గురించి తెలుసుకున్నాం. కానీ ఏడ్చే మొక్కల గురించి తెలుసా?అంటే తెలీదనే చెబుతాం. ఇటువంటి మొక్కలు చాలా అరుదగా ఉంటాయి. ఇవి మధ్యదరా సముద్ర తీర ప్రాంతంలో ఉంటాయి. వీటిని ‘మెండ్రక్’ మొక్కలు అని అంటాం. ఈ మొక్కలను నరికినప్పుడు అవి ఏడుస్తాయట. ఈ మొక్కలకు నీరు బాగా ఎక్కువగా తీసుకుంటాయి. దీంతో వాటిని నరికితే ఏడుపులాంటి శబ్ధం వినిపిస్తుంటుందట…

కదిలే చెట్లు..
మనుషులు కదులుతారు. రోబోలు కదులుతాయి. కానీ వస్తువులు కదలవు. మొక్కలు కూడా కదలవు. కానీ కదిలే చెట్లుంటాయనే విషయం మాత్రం పెద్దగా ఎవరికి తెలియదనే చెప్పాలి. ఇలా కదిలే చెట్లను మాంగ్రేవ్ అని పిలుస్తారు. ఇవి మెల్లమెల్లగా కదులుతూ కిలోమీటరు దూరం వరకూ వెళతాయట. ఈ రకమైన చెట్లు భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌గల సుందర్‌వన్ అడవులలో కనిపిస్తాయి.

 

ట్రెండింగ్ వార్తలు