100మంది పిల్లలను కనాలి, 23ఏళ్ల మహిళ టార్గెట్

mother wants more than 100 kids: ఈ రోజుల్లో ఇద్దరు పిల్లలను కనడమే చాలా కష్టం. కనడమే కష్టం అంటే, ఆ తర్వాత వారిని చూసుకోవడం, పోషించడం మరింత డిఫికల్ట్ టాస్క్. అలాంటి ఈ రోజుల్లో 10 మంది కాదు 20 మంది కాదు ఏకంగా 100 మంది పిల్లలను కనాలని అనుకునే మహిళలు ఉంటారా? అంటే.. సమస్యే లేదు. అలాంటి వారు ఈ భూలోకంలోనే ఉండరని మీరు ఓ నిర్ణయానికి వచ్చేయకండి సుమా. ఎందుకంటే, ఓ మహిళ ఉంది. 100 మంది పిల్లలను కనడమే ఆమె టార్గెట్. ఏంటి, షాక్ అయ్యారా? కానీ ఇది నమ్మతీరాల్సిన నిజం.

మ్యాటర్ లోకి వెళితే.. రష్యాకు చెందిన క్రిస్టినా-గల్లిప్ దంపతులకు పిల్లలంటే చాలా ఇష్టం. క్రిస్టినా వయసు 23ఏళ్లు. ఇప్పటికే ఈ దంపతులకు 11 మంది పిల్లలున్నారు. క్రిస్టినా మాత్రం ఇంకా పిల్లలు కావాలని కోరుకుంటోంది. ఏకంగా 100మందికి పైగా పిల్లల్ని కని, తన కుటుంబాన్ని విస్తరించాలనుకుంటోంది.

వీరి ఫ్యామిలీ విషయానికి వస్తే, జార్జియాకు చెందిన క్రిస్టినా – గల్లిప్ దంపతులు రష్యాలో పేరున్న కోటీశ్వరులు. వీరికి రష్యాలో అత్యంత విలాసవంతమైన రెస్టారెంట్ కూడా ఉంది. వీరికి 11 మంది పిల్లలు ఉండగా.. 10మంది సరోగసి ద్వారా జన్మించిన వారే. ఇందుకోసం ఒక్కో సరోగేట్ మదర్‌కు 8వేల యూరోలు (దాదాపు రూ.7లక్షలు)అందించామని గల్లిప్ తెలిపారు. ఇక్కడితో ఆగిపోకుండా మొత్తం 100మందికి పైగా పిల్లలను కనాలని అనుకుంటున్నారు.

తన భార్య క్రిస్టినా అంటే తనకెంతో ఇష్టమని, ఆమెకు పిల్లలంటే అమితమైన ప్రేమ అని గల్లిప్ చెప్పారు. ఆమె కోరికను నెరవేర్చడం కోసమే సరోగసి విధానాన్ని ఎంచుకున్నామని వివరించారు. 1997లో జార్జియాలో సరోగసీని చట్టబద్దం చేశారు.

ఇప్పుడీ న్యూస్ నెట్ లో వైరల్ గా మారింది. క్రిస్టినా కోరికా విని అంతా ఆశ్చర్యపోతున్నారు. నువ్వు గ్రేట్ అమ్మా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంట్లో ఒకరిద్దరు పిల్లలను చూసుకోవడం, వారి చేసే అల్లరిని భరించడం చాలా కష్టం. అలాంటిది వందమంది పిల్లలను చూసుకోవడం అంటే మామాలు విషయం కాదంటున్నారు. అయినా డబ్బున్నోళ్లు కాబట్టి, పిల్లలను చూసుకోవడం క్రిస్టినాకు పెద్ద కష్టమేమీ కాదంటున్నారు కొందరు నెటిజన్లు. మొత్తంగా, క్రిస్టినా కోరిక నెరవేరాలని వారు కోరుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు