mother love
mother love : జీవితంలో నిజమైన ప్రేమను అందించేది తల్లిదండ్రులు మాత్రమే. తిరిగి వారు బిడ్డల నుంచి ఆశించేది కూడా ప్రేమ మాత్రమే. ఉద్యోగంలో బిజీగా ఉన్న ఓ కొడుకుకి తల్లి పెట్టిన వాట్సాప్ మెసేజ్ చూస్తే.. పేరెంట్స్ కేవలం బిడ్డల నుంచి ఏం ఆశిస్తారో అర్ధం చేసుకోవడమే కాదు మనసు కదిలిపోతుంది.
Whatsapp New Feature : వాట్సాప్‌లో మెసేజ్ రియాక్షన్ అప్‌డేట్.. ఇకపై ఎన్ని ఎమోజీలైనా వాడొచ్చు!
తెల్లవారి లేస్తే అందరూ బిజీ బిజీ లైఫ్ గడుపుతున్నారు. ఇంట్లోవారిని పట్టించుకునే టైం కూడా దొరకట్లేదు. కానీ ఇంట్లో ఉండే పేరెంట్స్ బిడ్డల మంచి చెడ్డలతో పాటు కాస్త వారి అటెన్షన్‌ను కోరుకుంటారు. .. రీసెంట్ గా రిషిక్ సూరి అనే కుర్రాడి ట్వీట్ చూస్తే అదే అర్ధం అవుతుంది. రిషిక్ సూరి అనే వ్యక్తి తన వాట్సాప్ చాట్ స్కీన్ షాట్ ఒకటి షేర్ చేసాడు. “సారీ అమ్మా నేను మీటింగ్ లో బిజీగా ఉన్నాను.. ఏమైనా అర్జంటా?” అని తల్లిని అడిగితే.. “అర్ధం చేసుకోగలను.. నువ్వు ఎంత బిజీగా ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి మెసేజ్ చేసానని” తల్లి రిప్లై ఇవ్వడం చూసేవారికి భావోద్వేగాన్ని కలిగిస్తోంది. ఇక రిషిక్ సూరి “నా తల్లిని చాలా ప్రేమిస్తున్నాను” అనే క్యాప్షన్‌తో ట్విట్టర్‌లో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
WhatsApp Video Messages : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. త్వరలో వీడియో మెసేజ్‌లను కూడా పంపుకోవచ్చు..!
అందరు అమ్మలు ఇంతే.. ప్రతి క్షణం మన గురించే వారు ఆలోచిస్తూ ఉంటారు.. మీరు అదృష్టవంతులు అని కొందరు.. ఆమె ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని కొందరు రిప్లై ఇచ్చారు. తల్లిదండ్రులకు దూరం ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నవారు.. వారిని పట్టించుకోవడానికి కాస్త కూడా సమయం కేటాయించలేకపోతున్నవారు జస్ట్ ఇలాంటి చిన్న చిన్న ఎమోషన్స్ చూసి అయినా మారితే నిజంగా ఆ తల్లిదండ్రులు ఎంత సంతోష పడతారో కదా..
love my mother so much : ) pic.twitter.com/eqt0uHolPo
— Rishik Suri (@RishikSuri) April 12, 2023