Made HEPA Mask by Konda Vishweshwar Reddy : పార్లమెంట్ సమావేశాల్లో అందరి చూపులు ఎంపీ నరేంద్ర జాదవ్ పైనే ఉన్నాయి.కారణం ఆయన ధరించిన వెరైటీ డిజైన్ మాస్క్..ప్రత్యేక మాస్కు ధరించి పార్లమెంటుకు వచ్చిన ఎంపీ నరేంద్ర జాదవ్ వైపే అందరూ ఆసక్తిగా చూస్తూ..ఎక్కడ చేయించరీ మాస్క్ అంటూ అడిగి మరీ తెలుసుకున్నారు. మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి రూపొందించిన ప్రత్యేకమైన మాస్కు ధరించి పార్లమెంట్ కు వచ్చిన ఎంపీ నరేంద్ర జాదవ్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. సోమవారం (మార్చి 8,2021) సభలో ఈ మాస్క్ చర్చనీయాంశమైంది.
రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు నరేంద్ర జాదవ్ వినూత్నమైన మాస్క్ ధరించి సభకు వచ్చారు. ఆయన ధరించిన మాస్కు గురించి తోటి సభ్యులతో పాటు అందరూ ఆరా తీశారు.దీంతో నరేందద్ర జాదవ్ మాట్లాడుతూ..ఈ మాస్కును తన మిత్రుడు..మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తనకు ఈ మాస్కును గిఫ్టుగా ఇచ్చారని తెలిపారు.
99.97% సామర్థ్యం కలిగిన హై ఎఫీషియెన్సీ పార్టిక్యులేట్ ఎయిర్ (హెపా) మాస్క్‌ను సానుకూల పీడనం ఆధారంగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రూపొందించారు. కరోనా సమయంలో మాస్కులతో పాటు, ఇంట్లోనే శానిటైజర్ తయారు చేసుకోవడం, కరోనా పేషంట్లకు ప్రత్యేక వెంటిలేటర్ ప్రిసెషన్ ఎయిర్ పంప్ (పీఏపీ)ను ఇంజనీర్ అయిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తయారు చేసిన విషయం తెలిసిందే.