Kangana Ranaut: కంగనాకు ముంబై హైకోర్టు షాక్.. పాస్ పోర్ట్ రెన్యూవల్ కు బ్రేక్!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, క్వీన్ కంగనా రనౌత్, ముంబాయి పోలీసుల సమరం ఇప్పట్లో ముగిసేటట్లు కనపడటం లేదు. బాంద్రా పోలీస్‌ స్టేషన్‌లో ఆమెపై దేశద్రోహం కేసు నమోదైన సంగతి తెలిసిందే కాగా ఈ కేసు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పాస్ పోర్ట్ రెన్యూవల్ లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

Mumbai High Court Shocks To Kangana Ranaut Postponed For Passport Renewal

Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, క్వీన్ కంగనా రనౌత్, ముంబాయి పోలీసుల సమరం ఇప్పట్లో ముగిసేటట్లు కనపడటం లేదు. బాంద్రా పోలీస్‌ స్టేషన్‌లో ఆమెపై దేశద్రోహం కేసు నమోదైన సంగతి తెలిసిందే కాగా ఈ కేసు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పాస్ పోర్ట్ రెన్యూవల్ లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కంగనా పాస్‌ పోర్టు గడువు సెప్టెంబర్‌ 15న ముగియనున్న నేపథ్యంలో పాస్ పోర్ట్ రెన్యూవల్ చేయాలని ఆమె అధికారులను కంగనా కోరింది.

అయితే దేశద్రోహం కేసు నేపథ్యంలో తాము రెన్యూవల్ చేయలేమని అధికారులు చెప్పారు. దీంతో ఆమె ముంబై హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్ స్వీకరించిన కోర్టు ఈ కేసును ఈ నెల 25కు వాయిదా వేసింది. కంగనా పాస్‌ పోర్టు గడువు సెప్టెంబర్‌ 15న ముగియనుండగా ఈ నెలలో షూటింగ్ నిమిత్తం హంగేరిలోని బుడాపెస్ట్‌కు వెళ్లాల్సి ఉంది. ఈ నెల 15నుంచి ఆగస్టు 30 వరకు చిత్ర యూనిట్ షెడ్యూల్‌ ప్లాన్‌ చేశారు.

ఒకవేళ అక్కడ ఇబ్బందులు ఎదురైతే మరికొన్ని రోజులు అక్కడే ఉండాల్సిన వస్తే పాస్ పోర్ట్ గడువు ముగుస్తుంది. ఈలోగా పాస్ పోర్ట్ రెన్యూవల్ చేసుకోవాల్సి ఉండగా కేసు నేపథ్యంలో పోలీసులు అభ్యంతరం చెప్తున్నారు. మరి దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.