Munugode By Poll : రంగం తండాలో ఎన్నికలను బహిష్కరించిన ఓటర్లు .. ఎందుకంటే..

మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఈక్రమంలో ఓపక్క మాకు డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తామనే ఓటర్లు ఉంటే..మరోపక్క ఓట్లు వేశాక గెలిచిన నాయకులు తమకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించటంలేదని అందుకే ఈ ఉప ఎన్నికలో ఓటు వేసేది లేదన్నవారు ఉన్నారు. వారే రంగం తండావాసులు.

Munugode By Poll :  మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఈక్రమంలో ఓపక్క మాకు డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తామనే ఓటర్లు ఉంటే..మరోపక్క ఓట్లు వేశాక గెలిచిన నాయకులు తమకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించటంలేదని అందుకే ఈ ఉప ఎన్నికలో ఓటు వేసేది లేదన్నవారు ఉన్నారు. కొంతమంది ఓటును డబ్బుల కోసం కక్కుర్తిపడి వేస్తుంటే..మరికొందరు మాత్రం ప్రజాస్వామ్యబద్దంగా ఓటు వేయటానికి మేం సిద్ధంగా ఉన్నాం. కానీ మాకు కల్పిస్తానన్న మౌలిక సదుపాయాలు కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇస్తేనే ఓటు వేస్తామంటున్నారు.

మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల నోటిఫికేషన్ ప్రటించింది మొదలు ప్రచారం ముగిసే వరకు మద్యం ఏరులైపారింది. కోట్ల కొద్దీ నగదు చేతులు మారింది. భారీ భారీ బహుమతులు నజరానాలుగా మారాయి. కానీ మాకు అవేమీ వద్దు మా తండాకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇస్తే చాలు వారికే ఓటు వేస్తామంటున్నారు గట్టుప్పల్ మండలంలోని రంగం తండావాసులు.మాకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఏ పార్టీకి చెందిన నేతలు స్పష్టమైన హామీలు ఇవ్వలేదని అందుకే ఎన్నికను బహిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు రంగం తండావాసులు.

ఎన్నిసార్లు నేతలకు..అధికారులు విన్నవించుకున్నా మా గ్రామానికి మౌలిక సదుపాయాలు కూడా కల్పించటంలేదని అందుకే మా గ్రామంలో ఎవ్వరు ఓటు వేయం అని తేల్చి చెప్పారు రంగం తండావాసులు. రంగం తండాలో మొత్తం 320 ఓట్లు ఉన్నాయి. వీరంతా కూడా తమ గ్రామం అభివృద్ధి కోసం ఒకేమాటమీద నిలబడ్డారు.ఓటు వేయం అని తీర్మానించుకున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు