Naga Chaitanya Bollywood Entry : ఆమిర్ ఖాన్ సినిమాతో చైతు బాలీవుడ్ ఎంట్రీ..

టాలీవుడ్ యంగ్ హీరో, యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అయిపోయింది. చైతు, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ సినిమాతో హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నాడు. అక్కినేని వారసుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన చైతన్య సినిమా సినిమాకి నటుడిగా తనని తాను తీర్చిదిద్దుకుంటూ ప్రేక్షకాభిమానులను అలరిస్తున్నాడు.

Naga Chaitanya: టాలీవుడ్ యంగ్ హీరో, యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అయిపోయింది. చైతు, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ సినిమాతో హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నాడు. అక్కినేని వారసుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన చైతన్య సినిమా సినిమాకి నటుడిగా తనని తాను తీర్చిదిద్దుకుంటూ ప్రేక్షకాభిమానులను అలరిస్తున్నాడు.

అమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా ‘లాల్ సింగ్ చద్దా’.. ఆస్కార్ అవార్డ్ అందుకున్న హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘సీక్రెట్ సూపర్ స్టార్’ ఫేమ్ అద్వైత్ చందన్ డైరెక్ట్ చేస్తున్నారు.. ఈ సినిమాలో నాగ చైతన్య ఓ ఇంపార్టెంట్ రోల్ చెయ్యబోతున్నారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఎట్టకేలకు చైతు బాలీవుడ్ ఎంట్రీ కన్ఫమ్ అయిపోయింది.

‘లాల్ సింగ్ చద్దా’ లో చైతు కథలో కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఇంతకుముందు ఈ క్యారెక్టర్ కోసం వెర్సటైల్ యాక్టర్ ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతిని సంప్రదించగా డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆయన తప్పుకున్నారు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ చైతుతో రీ ప్లేస్ చేస్తున్నారు. ‘లాల్ సింగ్ చద్దా’ లో దాదాపు అరగంట సేపు చైతన్య రోల్ ఉంటుదని సమాచారం. ఇక చైతు బాలీవుడ్ ఎంట్రీ న్యూస్ ఫిక్స్ అని తెలియగానే చైతన్య ఫ్యాన్స్ పలు ఫ్యాన్ మేడ్ పోస్టర్లు డిజైన్ చేసి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. త్వరలో ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయనున్నారు.

Laal Singh Chaddha

ట్రెండింగ్ వార్తలు