Naga Chaitanya Pic With Shobitha Dhulipala Goes Viral
Naga Chaitanya: అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్‌పై పూర్తి ఫోకస్‌తో దూసుకుపోతున్నాడు. తాజాగా ఆయన తన కెరీర్‌లోని 22వ చిత్రాన్ని దర్శకుడు విక్రమ్ ప్రభు డైరెక్షన్‌లో తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఈ హీరోకు సంబంధించి ఇటీవల సినిమాల కంటే కూడా ఆయన పర్సనల్ విషయాలే సోషల్ మీడియాలో ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. చైతూ మాజీ భార్య సమంత విడాకుల తరువాత ఆమె అనారోగ్యం గురించి ఇటీవల సోషల్ మీడియాలో బయటకు రావడంతో, ఆమె త్వరగా కోలుకోవాలని పలువురు స్టార్స్ ట్విట్టర్ వేదికగా కోరుకున్నారు.
Naga Chaitanya: ఆమెతో లవ్ స్టోరీ.. నాకెన్నో పాఠాలు నేర్పింది.. నాగచైతన్య!
ఈ క్రమంలో చైతూ కూడా సామ్ ఆరోగ్యం గురించి ట్వీట్ చేస్తారని అందరూ చూశారు. కానీ ఈ హీరో మాత్రం సైలెంట్‌గా ఉండిపోయాడు. అయితే ఈమధ్య చైతూ మరో హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నాడని.. ఆమెతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని.. త్వరలోనే వారిద్దరి రిలేషన్ గురించి అఫీషియల్ ప్రకటన కూడా వస్తుందని సోషల్ మీడియాలో ఒక వార్త జోరుగా వినిపిస్తుంది. అయితే తాజాగా ఈ వార్తకు మరింత బలాన్నిచ్చే విధంగా నెట్టింట ఓ ఫోటో వైరల్‌గా మారింది. నాగచైతన్య నటి శోభిత ధూళిపాళతో కలిసి దిగిన ఫోటో ఒకటి నెట్టింట ప్రత్యక్షమయ్యింది.
Naga Chaitanya : నేను మళ్ళీ ప్రేమలో పడతాను.. బతకడానికి ఊపిరి ఎంత అవసరమో ప్రేమ కూడా అంతే..
ఇక ఈ ఫోటోతో చైతూ డేటింగ్ వార్తలు నిజమేనా అనే సందేహం అందరిలో మెదులుతోంది. అయితే ఈ ఫోటో ఎక్కడ, ఎప్పుడు దిగారు అనే విషయంపై మాత్రం క్లారిటీ లేకపోవడంతో సినీ వర్గాల్లో మరోసారి చైతూ డేటింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే తమ రిలేషన్‌పై ఇప్పటివరకు చైతూ, శోభిత ఇద్దరూ కూడా సైలెంట్‌గానే ఉన్నారు. ఏదేమైనా చైతూ డేటింగ్ రూమర్స్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.