Nagarjunasagar Three Colour Lights : మువ్వన్నెల్లో మురిసిపోతున్న నాగార్జునసాగర్..జాతీయ జెండాను తలపించేలా కృష్ణమ్మ పరవళ్లు
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు మువన్నెల్లో మురిసిపోతోంది. త్రివర్ణ వెలుగుల్లో జిగేల్‌మంటోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు త్రివర్ణ శోభితంగా మారింది. మూడు రంగుల జాతీయ జెండాను తలపించేలా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.
- bheemraj
- Published On : August 14, 2022 / 06:12 PM IST
Nagarjunasagar Three Colour Lights
Nagarjunasagar Three Colour Lights : నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు మువన్నెల్లో మురిసిపోతోంది. త్రివర్ణ వెలుగుల్లో జిగేల్‌మంటోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు త్రివర్ణ శోభితంగా మారింది. మూడు రంగుల జాతీయ జెండాను తలపించేలా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.
Eagle National Flag : జాతీయ పతాకాన్ని నోట కరచుకుని మానేరు డ్యామ్‌పై చక్కర్లు కొట్టిన గద్ద
సాగర్ 26 క్రస్టు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండగా… అధికారులు మూడు రంగులతో క్రెస్టు గేట్లకు లైటింగ్ సెట్ చేశారు. దీంతో త్రివర్ణ పతాకాన్ని తలపించేలా సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ దృశ్యాలు ప్రజలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. మువ్వన్నెలు ప్రజల మనసును దోచుకుంటున్నాయి.
