Munugode By-Election Counting : మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్.. ఏ రౌండ్లో ఏ మండలం ఓట్లు లెక్కింపు

నల్లగొండ జిలా మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తైంది. పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది.

Munugode By-Election Counting : నల్లగొండ జిలా మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తైంది. పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. టీఆర్ఎస్ 228, బీజేపీ 224 ఓట్లు, కాంగ్రెస్ 136 ఓట్లు సాధించాయి. ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. 21 టేబుళ్లపై కౌంటింగ్ కొనసాగుతోంది. 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. తొలి రౌండ్ లో చౌటుప్పల్ మండలం ఓట్లను లెక్కిస్తారు. మునుగోడు నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలో 298 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.

1,2,3,4 రౌండ్లలో చౌటుప్పల్ మండలం. 4,5,6 రౌండ్లలో నారాయణపురం మండలం. 6,7,8 రౌండ్లలో మునుగోడు మండలం. 8,9,10 రౌండ్లలో చండూరు మండలం. 10,11 రౌండ్లలో గట్టుప్పల్ మండలం. 11, 12, 13 రౌండ్లలో మర్రిగూడ మండలం. 13,14,15 రౌండ్లలో నాంపల్లి మండలం ఓట్లు కౌంటింగ్ చేయనున్నారు. ప్రతి రౌండ్ కు 30 నిమిషాల నుంచి 40 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది.

Postal Ballot TRS lead : మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్.. పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ ఆధిక్యం

47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులుగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి(టిఆర్ఎస్), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(బిజెపి), పాల్వాయి స్రవంతి(కాంగ్రెస్), ఆనందాచారీ (బీఎస్పీ) ఉన్నారు. గురువారం(నవంబర్3,2022) మునుగోడు ఉపఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 2,41,855 ఓట్లకుగానూ 2,25,192 ఓట్లు (93.16%) పోల్ అయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు