Varalaxmi Sarath Kumar: బాలయ్యకే షాకిచ్చిన జయమ్మ డైలాగ్.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 5 పేజీలు!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, బాలయ్య ఈ సినిమాతో మరోసారి తనదైన మార్క్ వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

Varalaxmi Sarath Kumar: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, బాలయ్య ఈ సినిమాతో మరోసారి తనదైన మార్క్ వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

Varalaxmi Sarath Kumar: బాలయ్య సినిమాలో జయమ్మను మించి ఊరమాస్..?

కాగా, ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అందాల భామ వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని, చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ గురించి పక్కనబెడితే, ఆమె చెప్పే డైలాగ్స్‌కు హీరో బాలయ్య కూడా అవాక్కయ్యాడట. షూటింగ్ సమయంలో ఈ సినిమాలోని ఓ కీలక సీన్ కోసం వరలక్ష్మీ పాత్రకు ఏకంగా 5 పేజీల డైలాగ్ ఉందట. అయితే కొంచెంకొంచెంగా ఈ డైలాగులను షూట్ చేద్దామని దర్శకుడు చెప్పగా, అలా కాకుండా కేవలం సింగిల్ టేక్‌లోనే 5 పేజీల డైలాగును పూర్తి చేసిందట ఈ నటి.

Varalaxmi Sarath Kumar : నయనతార సెలబ్రిటీ కాబట్టే సరోగసి వివాదం అయింది.. బయట అది మాములుగా జరుగుతూనే ఉంది..

దీంతో సెట్స్‌లో ఉన్న అందరూ అవాక్కయ్యారట. ముఖ్యంగా బాలయ్య కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ డెడికేషన్, మెమరీకి ఫిదా అయ్యాడట. ఇది తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే సీన్‌గా మిగులుతుందని వరలక్ష్మీ శరత్ కుమార్ తెలిపింది. ఈ సినిమాలో బాలయ్య సరసన అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు