నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ‘బింబిసార’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా, ఈ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ వీక్షించారు. బింబిసార చిత్ర టీమ్‌ను ఆయన ఈ సందర్భంగా అభినందించారు.