National Herald case: బ్యాంకులను లూటీ చేసినవారంతా బీజేపీలో ఉన్నారు..వారిపై ఈడీ చర్యలు తీసుకోదా? : జగ్గారెడ్డి

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో రాహుల్ గాంధీ మరోసారి (రెండోరోజు)విచారణ కోసం ఈడీ ముందుకు హాజరయ్యారు. ఈక్రమంలో బ్యాంకులను లూటీ చేసినవారంతా బీజేపీలో ఉన్నారు..వారిపై ఈడీ చర్యలు తీసుకోదా? అంటూ ఆగ్రహంతో ప్రశ్నించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

National Herald case: బ్యాంకులను లూటీ చేసినవారంతా బీజేపీలో ఉన్నారు..వారిపై ఈడీ చర్యలు తీసుకోదా? అంటూ ఆగ్రహంతో ప్రశ్నించారు తెలంగాణ కాంగ్రెస్ నేత..ఎమ్మెల్యే జగ్గారెడ్డి. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ ఎదుట రెండో రోజు రాహుల్ గాంధీ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బ తీసేందుకు బీజేపీ కేసుల్లో ఇరికించి అగౌరపరుస్తోంది అంటూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా సోమవారం నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తోంది. కాంగ్రెస్ నేతలు బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. బీజేపీ కావాలనే గాంధీ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయటానికి ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీపై తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి విమర్శలు సంధించారు.

గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా హత్య చేయటానికి బీజేపీ కుట్రపన్నుతోందని ఆరోపించారు. అందుకే గాంధీకుటుంబంపైకి ఈడీ కేసుల్ని ప్రయోగించిందని అన్నారు.దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని..కానీ దేశం కోసం త్యాగం చేసినవారు బీజేపీలో ఒక్కరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. స్వాంత్ర్యోద్యంలో బ్రిటీష్ పాలకులకు ఆర్ఎస్ఎస్ వత్తాసు పలికింది అని గుర్తు చేశారు. గాంధీజి చంపిన నాథూరాం గాడ్సేని పార్లమెంట్ లో బీజేపీ నేతలు గొప్పవాడని పొగుడుతున్నారని..ఇంతకంటే సిగ్గు చేటు అయిన విషయం ఏమన్నా ఉంటుందా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

కాగా ..నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోమవారం రాహుల్‌ గాంధీని ప్రశ్నించారు ఈడీ అధికారులు. దీంట్లో భాగంగా రాహుల్ గాంధీ మంగళవారం మరోసారి (రెండోరోజు)విచారణ కోసం ఈడీ ముందుకు హాజరయ్యారు. రాహుల్‌ వెంట ప్రియాంక గాంధీ కూడా ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు. అంతకముందు ఏఐసీసీ కార్యాలయం వద్ద రాహుల్‌ గాంధీ ధర్నాలో పాల్గొన్నారు. రాహుల్‌తోపాటు ధర్నాకు దిగిన కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరోవైపు ఈడీ విచారణపై కాంగ్రెస్‌ నిరసనలు కొనసాగుతున్నాయి. ఇక రెండోరోజు విచారణ క్రమంలో ఢిల్లీలో ఆంక్షలు విధించారు పోలీసులు. అక్బర్ రోడ్, జన్‌పథ్‌ మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ట్రెండింగ్ వార్తలు