India vs New Zealand: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. ఓపెనర్లుగా క్రీజులోకి ఇషాన్, పంత్

న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా నేడు బే ఓవల్ మైదానంలో రెండో టీ20 మ్యాచ్ ఆడుతోంది. మొదటి మ్యాచు వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. నేటి మ్యాచులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టులో హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), సూర్య కుమార్‌ యాదవ్, శ్రేయాస్‌ అయ్యర్‌, దీపక్‌ హుడా, వాషింగ్టన్ సుందర్‌, భువనేశ్వర్‌ కుమార్, అర్ష్‌దీప్‌ సింగ్, సిరాజ్‌, చాహల్ ఉన్నారు.

India vs New Zealand: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా నేడు బే ఓవల్ మైదానంలో రెండో టీ20 మ్యాచ్ ఆడుతోంది. మొదటి మ్యాచు వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. నేటి మ్యాచులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టులో హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), సూర్య కుమార్‌ యాదవ్, శ్రేయాస్‌ అయ్యర్‌, దీపక్‌ హుడా, వాషింగ్టన్ సుందర్‌, భువనేశ్వర్‌ కుమార్, అర్ష్‌దీప్‌ సింగ్, సిరాజ్‌, చాహల్ ఉన్నారు.

న్యూజిలాండ్ జట్టులో డి కాన్వే, అల్లెన్, కానె విలియమ్సన్, ఫిలిప్స్, నీషం, మిచెల్, మిల్నీ, శాంట్నర్, సోథీ, సౌతీ, ఫెర్గుసన్ ఉన్నారు. వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలికంగా చీఫ్ కోచ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రాహుల్ ద్రవిడ్ కోచింగ్ బృందానికి బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. ఈ సిరీస్ లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, కోహ్లీ కూడా ఆడడం లేదు. నేటి మ్యాచులో ఓపెనర్లుగా క్రీజులోకి  ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ వచ్చారు.

India vs New Zealand

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ట్రెండింగ్ వార్తలు