Minister Kiri Allan : ఫుల్‌గా మందుకొట్టి కారు నడిపిన కేంద్ర మహిళా మంత్రి .. పోలీసులు అరెస్ట్ చేయబోతే రచ్చ రచ్చ

కేంద్ర న్యాయశాఖా మంత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. బ్రీతింట్ టెస్టులు చేసిన పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రధాని రంగంలోకి దిగి ఆమె పరిస్థితి బాధాకరమని అన్నారు.

New Zealand  justice minister Kiri Allan

New Zealand  Justice Minister Kiri Allan : ఆమె ఓ కేంద్ర మంత్రి. పైగా న్యాయశాఖామంత్రి. కానీ మద్యం తాగి కారు డ్రైవ్ చేశారు. మద్యం మత్తుతో కారును ర్యాష్ గా డ్రైవ్ చేసి కొన్ని వాహనాలను ఢీకొన్నారు. దీంతో పోలీసులు ఆమెను అడ్డుకుని బ్రీతింగ్ టెస్ట్ (Breathing test) చేయబోతే నానా గొడవ చేశారు న్యూజిలాండ్‌ (New Zealand) న్యాయశాఖ మంత్రి కిరి అలెన్‌ (Justice Minister Kiri Allan). కానీ పోలీసులు ఆమెకు బ్రీతింగ్ పరీక్షలు చేయగా మోతాదుకు మించి మద్యం తాగినట్లుగా గుర్తించారు. దీంతో ఆమెను అరెస్ట్ చేయబోతే పోలీసులపై ఎదురు తిరిగారు. ఇష్టమొచ్చినట్లుగా తిట్టారు. కానీ పోలీసులు ఆమెను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఆమెపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు.

మంత్రి కిరి అలెన్ లెల్లింగ్ టన్ లో ఆదివారం (జులై 2023)రాత్రి 9గంటల ప్రాంతంలో మద్యం తాగి కారును అతివేగంగా నడిపే క్రమంలో ఓ పార్కింగ్‌ ప్లేసులో వాహనాలకు ఆమె కారు ఢీకొంది. దీంతో కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను పరీక్షించగా మొదటి బ్రీతింగ్ పరీక్షలకు ఆమె అంగీకరించాలేదు. పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్నారు. పోలీసుల్ని తిట్టారు. కానీ పోలీసులు సమన్వయం పాటిస్తు ఆమెకు పరీక్షలు చేయగా మోతాదుకు మించి తాగినట్లుగా నిర్ధారించారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేయటానికి యత్నించగా నానా రచ్చా చేశారు. కానీ పోలీసులు ఎట్టకేలకు ఆమెను అదుపులోకి తీసుకుని స్టేషన్ ను తరలించారు. నాలుగు గంటలపాటు అక్కడే ఉంచారు. క్రిమినల్ కేసులు నమోదు చేయటంతో ఆమె సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. కాగా ఆమెపై పలు క్రిమినల్ కేసులు నమోదు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఆమె కోర్టులో ఈ కేసుల్ని ఎదుర్కోవాల్సి ఉంది. ఆమె దోషి అని తేలితే జరిమానాతో పాటు ఆమె డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయనున్నారు.

Cows on Apartment Balcony : అపార్ట్‌మెంట్ బాల్కనీలో ఆవుల్ని పెంచుతున్న యజమాని .. ఎన్నో ఫ్లోర్‌లోనో తెలుసా..?

ఈ ఘటనపై ప్రధాని క్రిస్‌ హిప్కిన్స్‌ (Prime Minister Chris Hipkins) సోమవారం ఉదయం మంత్రి అలెన్‌తో మాట్లాడారు. ఆమె మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారని.. మంత్రిగా విధులు నిర్వహించేందుకు తగినంత ఫిట్‌గా లేరని పేర్కొన్నారు. న్యాయశాఖ మంత్రి క్రిమినల్‌ కేసులో ఇరుక్కోవడం సహించరానిదన్నారు. దీంతో అలెన్‌ రాజీనామా చేయడానికి అంగీకరించారు. పార్లమెంట్‌ సభ్యురాలిగా మాత్రం ఆమె కొనసాగుతారు.

కాగా అలెన్ ఒకప్పుడు లేబర్ పార్టీలో తిరుగులేని నేతగా పేరొందారు. మంచి పేరుంది. లేబర్‌ పార్టీ (Labour Party) లో 39 ఏళ్ల అలెన్‌ చాలా వేగంగా ఎదిగిన ఆమె భర్తతో విభేధాలు రావటంతో విడిపోయారు. దీంతో ఆమె మానసికంగా కృంగిపోయారు. ఒకప్పుడు ఎటువంటి క్లిష్టపరిస్థితికి సంబంధించిన విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకునే ఆమె భర్తతో విడిపోయాక ఆమె ప్రవర్తన మారిపోయింది. ఆమెకు సంబంధించిన శాఖ ఉద్యోగులతో కూడా సరిగా ప్రవర్తించటంలేదనే ఆరోపణలున్నాయి.

Moon Influence Earth Climate : భూమి వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్న చంద్రుడు

ఈక్రమంలో ప్రధాని హిప్కిన్స్ అలెన్ పరిస్థితి చూసి చలించిపోయారు. ఇటువంటి పరిస్థితిలో అలెన్ ను చూస్తుంటే బాధగా అనిపిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. విపత్కర పరిస్థితుల్లో కూడా చక్కటి నిర్ణయాలు తీసుకునే ఆమె ఇలా మారిపోయారని..మానసికంగా ఆమె కృంగిపోయారని ప్రతిభావంతమైన నేతగా పేరొందిన అలెన్ ఇలా అయిపోవటం బాధకలిగిస్తోందన్నారు. తన పరిస్థితిని గుర్తించిన అలెన్ తన పదవికి రాజీనామా చేయటానికి అంగీకరించి చేశారని తెలిపారు.

దీంతో ప్రధాని హిప్కిన్స్ కేబినెట్ లో పదవి కోల్పోయిన నాలుగో మంత్రి అలెన్. అక్టోబర్‌ 14 తేదీన న్యూజిలాండ్‌లో ఎన్నికలు (New Zealand Elections) జరగనున్నాయి. ఈ సమయంలో మంత్రుల వివాదాలు, రాజీనామాలు హిప్కిన్స్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి.