Nidhhi Agerwal: అన్నింటికీ ఓకే అంటే ఇక అంతే – నిధి అగర్వాల్!
టాలీవుడ్‌లో పలు సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో దక్కించుకుంది అందాల భామ నిధి అగర్వాల్. ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో అందాల ఆరబోతకు.....
- Anil Aaleti
- Published On : April 6, 2022 / 09:27 PM IST
Nidhhi Agerwal About Selecting Movies
Nidhhi Agerwal: టాలీవుడ్‌లో పలు సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో దక్కించుకుంది అందాల భామ నిధి అగర్వాల్. ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో అందాల ఆరబోతకు నో లిమిట్ అంటూ రెచ్చిపోయిన ఈ బ్యూటీకి ఆ సినిమా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాలో అమ్మడి పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలవడంతో, అమ్మడికి వరుసబెట్టి ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.
Nidhhi Agerwal : అందాల నిధులన్నీ తనలోనే దాచుకుంది..
ప్రస్తుతం ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో నటనకు స్కోప్ ఉన్న పాత్రలో ఈ బ్యూటీ చేస్తుండటం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అయితే ఇస్మార్ట్ శంకర్ చిత్రం తరువాత చాలా సమయం తీసుకుని పవన్ సినిమాలో నటిస్తుండటంపై ఆమెను ప్రశ్నించగా.. వరుస ఆఫర్లు వచ్చినా తాను మాత్రం చాలా సెలెక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. వచ్చిన ప్రతీ ఆఫర్‌ను ఓకే చేసుకుంటూ వెళ్తే.. ఎంత త్వరగా ఎదుగుతామో, అంతే త్వరగా ఫేడవుట్ కూడా అవుతామని ఆమె చెబుతోంది.
Nidhhi Agerwal: తమిళ హీరోతో నిధి ప్రేమాయణం.. త్వరలోనే పెళ్లి?
అందుకే అందాల ఆరబోతకంటే కూడా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను తాను ఎంచుకుంటున్నట్లు చెబుతోంది. అటు తమిళంలో కూడా తనకు మంచి పాత్రలు దక్కుతున్నాయని, త్వరలోనే మరిన్ని సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వస్తానని అమ్మడు చెబుతోంది. మరి నిజంగానే హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ పాత్రకు అంతటి స్కోప్ ఉందా.. ఇకపై కూడా అమ్మడు కేవలం యాక్టింగ్ ఓరియెంటెడ్ పాత్రలకే ఓటేస్తుందా.. అనే అంశాలు తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే. అయితే నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోయి అందాల విందు చేస్తుండటం విశేషం.
