Boarding Pass Charges: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏవియేషన్ మంత్రిత్వ శాఖ

విమాన ప్రయాణికులకు ఏవియేషన్ మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. విమానాశ్రయాల్లో చెకిన్ కౌంటర్ల వద్ద బోర్డింగ్ పాస్ ల జారీకి ఎలాంటి అదనపు ఫీజులను విధించకూడదని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.

Airlines

Boarding Pass Charges: విమాన ప్రయాణికులకు ఏవియేషన్ మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. విమానాశ్రయాల్లో చెకిన్ కౌంటర్ల వద్ద బోర్డింగ్ పాస్ ల జారీకి ఎలాంటి అదనపు ఫీజులను విధించకూడదని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ అదనపు ఛార్జీలు ఎయిర్ క్రాప్ట్ రూల్స్, 1937 ప్రొవిజన్లకు వ్యతిరేకంగా ఉన్నాయని ఏవియేషన్ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇండిగోతో పాటు చాలా విమానయాన సంస్థలు విమానాశ్రయాల్లో చెకిన్ కౌంటర్ల వద్ద బోర్డింగ్ పాస్ లు జారీ చేస్తే చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ విషయంపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఏవియేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సిండియా స్పందించారు.. చెకిన్ కౌంటర్లలో బోర్డింగ్ పాస్ ల జారీకి విమాన సంస్థలు ప్రయాణికులపై విధిస్తోన్న ఛార్జీలను పరిశీలిస్తున్నామని తెలిపారు. దీనికితోడు వెబ్ చెకిన్ చేసుకోని ప్రయాణికులపై ఇండిగో, స్పైస్ జెట్, గోఎయిర్ లాంటి సంస్థలు చెకిన్ పాయింట్లలో బోర్డింగ్ పాస్ ల జారీకి రూ. 200 చార్జ్ చేశాయి.

ఈ విషయంపై ప్రయాణికులు పలుసార్లు సోషల్ మీడియా ద్వారా మంత్రికి ఫిర్యాదు చేశారు. ఏవియేషన్ మంత్రిత్వ శాఖ తాజాగా విమానయాన సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం విమానయాన సంస్థలు వసూళ్లు చేస్తున్న చెకిన్ బోర్డింగ్ ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు, ఇకనుంచి ఎలాంటి ఛార్జీలు వసూళ్లు చేయొద్దని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.