దేశ ప్రజలందరికి కరోనా వ్యాక్సిన్ అవసరం లేదంట!

  • Publish Date - December 2, 2020 / 07:02 AM IST

No need corona virus vaccine entire nation : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపించింది. ఎక్కడా చూసిన కరోనా కేసులే. భారతదేశంలోనూ అదే పరిస్థితి నెలకొంది. అయితే అందరికి కరోనా వ్యాక్సిన్ వేయడం సాధ్యమేనా? అంటే.. దేశంలోని అందరికీ వ్యాక్సినేషన్‌ చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అవసరమైనంత మందికి వ్యాక్సిన్‌ ఇస్తే సరిపోతుందని పేర్కొంది. కరోనా వ్యాక్సిన్‌ ఉద్దేశం వైరస్‌ చైన్‌ను నిరోధించడమేనని తెలిపింది. దేశంలోని అందరికీ వ్యాక్సినేషన్‌ చేయాల్సిన అవసరం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ప్రతీఒక్కరికీ కరోనా వ్యాక్సిన్‌ ఇస్తామని చెప్పలేదని స్పష్టం చేసింది.



అవసరమైనంత మందికి వ్యాక్సిన్‌ ఇచ్చిన తర్వాత అందరికీ వ్యాక్సినేషన్‌ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చునని తెలిపింది సాంకేతికపరమైన అంశాల్లో వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని చర్చలు జరుగుతాయన్నారు. జనాభాలో కొద్ది మందికే టీకా ప్రారంభిస్తామని అధికారి ఒకరు వెల్లడించారు.



https://10tv.in/covishield-safe-and-immunogenic-incident-with-chennai-volunteer-no-way-induced-by-it-serum-institute/
కరోనా నియంత్రణలో మాస్క్ లను  కవచంగా వాడాలని బలరాం భార్గవ ప్రజలను కోరారు. వ్యాక్సిన్‌లపై వచ్చే అసత్య కథనాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. మీడియా, వ్యాక్సిన్‌ తయారీదారులపై బాధ్యత ఉందన్నారు. వ్యాక్సిన్‌ భద్రతపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వం పూర్తి వివరాలను వెల్లడిస్తుందని చెప్పారు.



చెన్నై వాలంటీర్‌పై ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయన్న ఆరోపణలతో, ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాలను నిలిపివేయాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. సీరం ఇనిస్టిట్యూట్‌పై వచ్చిన ఆరోపణల కారణంగా టీకా అభివృద్ధి ప్రక్రియలో ఎటువంటి మార్పులు ఉండబోవన్నారు. నిర్ణీత కాలవ్యవధిలోనే ట్రయల్స్  పూర్తి అవుతాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు.



ఆ్రస్టాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి పరుస్తున్న కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ ప్రయోగం కారణంగా వాలంటీర్లలో ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తాయన్న ఆరోపణలను సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తిరస్కరించింది.