Ap Municipal Election Couning
[svt-event title=”కేశినేని శ్వేత విజయం” date=”14/03/2021,1:25PM” class=”svt-cd-green” ] విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత విజయం సాధించారు. 11వ డివిజన్‍లో కేశినేని శ్వేత విజయం సాధించగా.. మొదట్లో పోస్టల్ బ్యాలట్ లో వెనకబడినప్పటికీ మిగిలిన రౌండ్లలో కేశినేని శ్వేత ఆధిక్యత కనపర్చారు. టీడీపీ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేతను టీడీపీ ప్రకటించింది. మొత్తం 64 డివిజన్లలో వైసీపీ, టీడీపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. [/svt-event]
[svt-event title=”విశాఖలో హోరాహోరీ పోరు.. ” date=”14/03/2021,1:24PM” class=”svt-cd-green” ] విశాఖపట్నం నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు కొనసాగుతోండగా.. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో వైసీపీలో ఆధిక్యంలో సాగుతోంది. వైసీపీ 11స్థానాల్లో, టీడీపీ 9స్థానాల్లో, జనసేన 1, స్వతంత్రులు 1, సీపీఎం ఒక చోట విజయం సాధించింది. బ్యాలెట్ బాక్సుల్లో ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అని రాసిన పత్రాలను సిబ్బంది గుర్తించి వేరు చేస్తున్నారు. విశాఖ కార్పొరేషన్లో మొత్తం 90 డివిజన్లు ఉండగా.. ఫలితం రావడానికి సమయం పడుతుంది. [/svt-event]
[svt-event title=” 50 డివిజన్లలో 22 ఏకగ్రీవం చేసుకున్న వైసీపీ” date=”14/03/2021,12:16PM” class=”svt-cd-green” ] వైసీపీ హవా రాకెట్ లా దూసుకుపోతుంది. ఏకగ్రీవాలతో దూసుకుపోతూ.. కొద్ది చోట్ల మినహాయించి దాదాపు విజయం ఖాయమైనట్లే కనిపిస్తుంది. [/svt-event]AP Municipal Election Results 2021: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో ప్రభావం చూపిస్తోంది.
[svt-event title=”హిందూపురంలో ఆగిన కౌంటింగ్..” date=”14/03/2021,11:21AM” class=”svt-cd-green” ] అనంతపురం జిల్లాలో నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తోన్న హిందూపురం మున్సిపాలిటీలో ఏడవ వార్డులో ఓట్ల లెక్కింపు నిలిచింది. పోలైన ఓట్ల కంటే 9 ఓట్లు అధికంగా రావడంతో కౌంటింగ్ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చెయ్యడంతో ఎన్నికల అధికారులు అభ్యర్థులతో చర్చలు జరుపుతున్నారు. [/svt-event]
[svt-event title=”దూసుకుపోతున్న వైసీపీ” date=”14/03/2021,11:02AM” class=”svt-cd-green” ] ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఆధిక్యం కనబరుస్తోంది. ప్రకాశం జిల్లా కనిగిరి, గిద్దలూరు మున్సిపాలిటీలను వైసీపీ గెల్చుకుంది. కనిగిరిలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 20 వార్డుల్లో ఏడు ఏకగ్రీవమైతే…ఓట్ల లెక్కింపు జరిగిన 13 వార్డుల్లోనూ అధికారపార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. గిద్దలూరులోని 20 వార్డుల్లో ఏకగ్రీవాలతో కలిపి వైసీపీకి 15 గెల్చుకుంది. ప్రకాశం జిల్లా చీమకుర్తిని వైసీపీ సొంతం చేసుకుంది. 20వార్డుల్లో వైసీపీ 18, టీడీపీ 2చోట్ల విజయం సాధించాయి. [/svt-event]
[svt-event title=”నాయుడుపేటలో వైసీపీ విజయం” date=”14/03/2021,11:11AM” class=”svt-cd-green” ] నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీని వైసీపీని గెల్చుకుంది. నాయుడుపేటలోని 25 వార్డుల్లో వైసీపీ 23 చోట్లు విజయం సాధించింది. టీడీపీ, బీజేపీ చెరో వార్డులో విజయం సాధించారు. [/svt-event]
[svt-event title=”కొవ్వూరులో వైసీపీ విజయం” date=”14/03/2021,11:12AM” class=”svt-cd-green” ] పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీలోనూ వైసీపీ విజయం సాధించింది. కొవ్వూరులో మొత్తం 23 వార్డులు వైసీపీ 15 చోట్ల విజయం సాధించింది. టీడీపీ 7 చోట్ల గెలుపొందితే బీజేపీ ఒకచోట గెలుపొందింది. [/svt-event]