ఆమె చేతిపై పచ్చబొట్టు..అత్యాచారం నిందితుడికి బెయిల్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు : ‘టాటూ వేయటం అంత ఈజీ కాదు‘అన్న ధర్మాసనం

‘Not easy to force a tattoo’Delhi HC : ఓ మహిళ మీద అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొనే ఓ నిందితుడికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నామీద అత్యాచారం చేశాడని పిటీషన్ వేసిన మహిళ చేతిమీద ఉన్న పచ్చబొట్టు (టాటూ)ను ఆధారం చేసుకున్న హైకోర్టు నిందితుడుకి బెయిల్ ఇచ్చింది. అదేంటీ అత్యాచారం నిందితుడికి పిటీషన్ వేసిన మహిళ చేతిమీద ఉన్న పచ్చబొట్టుకు సంబంధం ఏంటీ? పచ్చబొట్టును చూసి బెయిల్ ఇవ్వటమేంటీ? అని షాక్ అవ్వొచ్చు..అదే ఈ కేసులో ట్విస్టు. బాధితురాలి తనపై అత్యాచారం చేశాడని ఆరోపించిన వ్యక్తి పేరునే తన చేతి మీద టాటూగా వేయించుకుంది. దాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు నిందితుడికి బెయిల్‌ మంజూరు చేసిన ఈ కేసులో ఇదే కీలక ఆధారమని ధర్మాసనం నమ్మి నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.

అసలు విషయం ఏమిటంటే..ఈ కేసులో కోర్టు విచారణ సందర్భంగా అత్యాచారం ఆరోపణలు చేసి మహిళ.. నిందితుడు బలవంతంగా అతడి పేరును తన చేతి మీద టాటూ వేయించాడని ఆరోపిస్తూ కోర్టుకు చెప్పింది. కానీ కోర్టు ఆమె మాటల్ని నమ్మలేదు. కొట్టి పారేసింది. ఇవి కేవలం ఆరోపణలు వలెనే ఉన్నాయి తప్ప నిజాలు కాదని నమ్మింది. బలవంతంగా ఓ వ్యక్తికి టాటూ వేయడం అంత జీజీ కాదని వ్యాఖ్యానించింది.

ఈ సందర్భంగా ఈకేసును విచారించిన జస్టిస్‌ రజ్నిష్‌ భట్నాగర్‌ మాట్లాడుతూ.. ‘‘నా అభిప్రాయం ప్రకారం టాటూ వేయడం అనేది ఓ కళ. టాలూ వేయటం చాలా సున్నితంగా వేయాలి. టాటూ వేయటానికి ప్రత్యేకమైన పరికరం కావాలి. ఓ వ్యక్తికి బలవంతంగా టాటూ వేయలేం. వారి ఇష్టం ఉంటేనే వేసే అవకాశం ఉంటుంది. పచ్చబొట్టు పొడిపించుకోవడం ఇష్టం లేకపోతే అవతలి వారు దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. చేతిని పలు రకాలుగా కదుపుతారు. విదిలిస్తారు. అటువంటి సమయంలో పచ్చబొట్టు పర్ ఫెక్ట్ గా రాదు..కాబట్టి బలవంతంగా టాటూ వేయడం.. ఒకవేళ వేసినా అది పర్ఫెక్ట్‌గా రావడం అనేది జరగదు’’ అని వ్యాఖ్యానించారు. ఆమె చేతిమీద ఉన్న పచ్చబొట్టును పరిగణలోకి తీసుకున్న కోర్టు నిందితుడికి బెయిల్‌ మంజూరు చేసింది.

కోర్టు వ్యాఖ్యలు విన్న సదరు మహిళ ‘‘అతని తనను బెదిరించి..భయపెట్టి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. 2016 నుంచి 2019 వరకు అతను నామీద పలుసార్లు అత్యాచారం చేశాడని చెప్పుకొచ్చింది. కానీ ఇన్నాళ్లు నాకు భయం వేసి పోలీసులకు చెప్పలేదని..ఎట్టకేలకు ధైర్యం చేసి అతడి మీద పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించింది.

యువతి ఆరోపణలు ఇలా ఉంటే..మరోపక్క అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొనే నిందుతుడు మాత్రం… నిందితుడు మాత్రం సదరు వివాహితను తాను ప్రేమించానని..మీ ఇద్దరి ఇష్టంతోనే తమ మధ్య శారీరక సంబంధం కొనసాగించామని..కానీ కొన్నాళ్లుగా ఆమె తనను దూరం పెడుతుందని.. దాని గురించి ప్రశ్నించానని నామీద పోలీసులకు ఫిర్యాదు చేసిందని వెల్లడించాడు. ఈ కేసులో ఆమె చేతిమీద పచ్చబొట్టును మాత్రం కోర్టు పరిగణలోకి తీసుకుని సరదు నిందితుడికి బెయిల్ మంజూరు చేయటం ట్విస్టుగా ఉంది..

ట్రెండింగ్ వార్తలు