Nothing Ear (Stick) available at a discount of Rs 1000 but there is a catch
Nothing Ear (Stick) : నథింగ్ ఇయర్ (స్టిక్) కొన్ని రోజుల క్రితమే లాంచ్ అయింది. ఈ డివైజ్ ఇప్పటికే తగ్గింపు రేటుతో విక్రయిస్తోంది. ఇయర్‌బడ్‌లు రూ. 1000 డిస్కౌంట్ ఆఫర్‌తో అందుబాటులో ఉన్నాయి. అయితే, ప్రస్తుత నథింగ్ యూజర్లకు మాత్రమే ఆఫర్ వ్యాలిడిటీ అందిస్తుంది. ఉదాహరణకు, మీకు ఇప్పటికే నథింగ్ ఫోన్ (1) ఉన్నట్లయితే.. మీకు రూ. 1000 డిస్కౌంట్ లభిస్తుంది. తద్వారా నథింగ్ ఇయర్ బడ్ ధర రూ. 8,499కి తగ్గుతుంది.
నథింగ్ ఇయర్ (స్టిక్): ధర, ఫీచర్లు ఇవే :
నథింగ్ ఇయర్ (స్టిక్) భారత మార్కెట్లో రూ. 8499 వద్ద అందుబాటులో ఉంది. ఇయర్ (స్టిక్) కోసం మొదటి సేల్ నవంబర్ 4న కొన్ని దేశాల్లో ప్రారంభమవుతాయి. ఇయర్‌బడ్‌లు యూకే, అమెరికా, యూరప్‌తో సహా 40+ దేశాలు వంటి ఇతర ప్రాంతాలలో nothing.tech, retailers.In India ఎంపిక చేసిన రిటైలర్‌లలో అందుబాటులో ఉంటాయి. భారత్‌లో ఇయర్ (స్టిక్) నవంబర్ 17, 2022 నుంచి Flipkart, Myntraలో అందుబాటులో ఉంటుంది.
Nothing Ear (Stick) available at a discount of Rs 1000 but there is a catch
నథింగ్ ఇయర్ (స్టిక్) : స్పెసిఫికేషన్‌లు ఇవే :
నథింగ్ ఇయర్ (స్టిక్) 12.6mm డ్రైవర్‌లతో వస్తుంది. రిచ్ డెప్త్‌లు, క్లియర్ హైస్, బోల్డ్ వివరాలను అందిస్తుంది. సౌండ్ క్వాలిటీ స్థిరంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. నథింగ్ ఇయర్ (Stick) ఫెదర్‌లైట్‌గా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఇయర్ బడ్ కేవలం 4.4గ్రా బరువు ఉంటుంది. ఇయర్‌బడ్‌లు ఇయర్ (1) వంటి సిలికాన్ టిప్స్ అందించవు. బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఫుల్ బ్లాక్ చేయదు. ఇయర్‌బడ్‌లు నథింగ్ X యాప్‌కి అనుకూలంగా ఉంటాయి. ఇయర్‌బడ్‌లు సులభంగా ఫోన్ (1)తో పనిచేస్తాయి. ఈ డివైజ్ ఇయర్ బడ్ రెండింటిని కలపడానికి ఒక బటన్‌ను నొక్కాలి.
ఇయర్‌బడ్‌లు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను కలిగి ఉండవు. కానీ, బాస్ లాక్ టెక్నాలజీతో వస్తాయి. యూజర్ ప్రత్యేకమైన ఇయర్ కెనాల్ షేప్, ఇయర్‌బడ్‌ల ఫిట్‌ని పొందవచ్చు. క్లియర్ కాల్ క్వాలిటీని అందించడానికి ఇయర్‌బడ్స్‌లో మూడు హై-డెఫినిషన్ మైక్‌లు అమర్చారు. బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ ఫిల్టర్ చేస్తాయి. విండ్ ప్రూఫ్ క్రౌడ్ ప్రూఫ్ కాల్‌తో మీ వాయిస్‌ని పెంచుతాయి.
Nothing Ear (Stick) available at a discount of Rs 1000 but there is a catch
ఇయర్‌బడ్‌లు ప్రతి ఇయర్‌బడ్‌పై ఉండే ప్రెస్ కంట్రోల్ కలిగి ఉంటాయి. మీ చేతివేళ్లు తడిగా ఉన్నప్పుడు కూడా పని చేస్తాయి. ఇయర్ బడ్ ప్లే చేయడానికి, పాజ్ చేయడానికి, ట్రాక్‌లను క్రాస్ చేయడానికి వాయిస్ మోడ్ యాక్టివ్ చేయడానికి సాయపడుతుంది. అంతేకాదు.. వాల్యూమ్‌ని మార్చడానికి యూజర్లు ఇయర్‌బడ్ స్టెమ్‌పై నొక్కవచ్చు.
బ్యాటరీ పరంగా, ఇయర్ స్టిక్ ఇయర్‌బడ్స్‌తో 7 గంటల వరకు లిజనింగ్ టైమ్ అందించవచ్చు. ఇయర్‌బడ్స్‌తో 3 గంటల వరకు మాట్లాడే సమయాన్ని అందిస్తుంది. స్పీడ్ ఛార్జింగ్ కోసం కేస్ మరో 22 గంటల ఛార్జ్‌ని ప్యాక్ అందిస్తుంది. మీరు 10 నిమిషాల పాటు ఛార్జర్ పెడితే.. గరిష్టంగా 2 గంటల వరకు వినవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..