Nothing Phone (1) next sale on August 5 _ Price in India, features and more
Nothing Phone (1) Next Sale : భారత మార్కెట్లో ఆగస్టు 5న మరోసారి నథింగ్ ఫోన్ (1) సేల్ ప్రారంభం కానుంది. నథింగ్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ నుంచి వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్. మిడ్ రేంజ్ ఫోన్లకు పోటీగా వచ్చిన ఈ ఫోన్ మోడల్ డిజైన్ సంచలనం క్రియేట్ చేసింది. నథింగ్ ఫోన్‌ని కొన అవకాశం లేని వినియోగదారులు ఆగస్టు 5న ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. నథింగ్ ఫోన్ (1) భారత మార్కెట్లో మూడు వేరియంట్లలో వస్తుంది. 8GB RAM + 128GB స్టోరేజ్ బేస్ మోడల్ ధర రూ.32,999గా ఉంది.
8GB RAM + 256GB స్టోరేజ్, 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్‌లతో సహా ఇతర రెండు మోడల్‌లు వరుసగా రూ. 35,999, రూ. 38,999 ధరల్లో లభ్యం కానుంది. ఏదైనా బ్యాంక్ కార్డ్ ఆఫర్‌లు ఉంటాయా లేదా ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కస్టమర్‌లు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఆప్షన్ పొందవచ్చు. కానీ, మీరు నథింగ్ ఫోన్ (1)ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయకపోవడమే మంచిదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Nothing Phone (1) next sale on August 5 _ Price in India, features and more
ఎందుకంటే.. చాలా మంది వినియోగదారులు గ్రీన్ టింట్ సమస్యలను ఎదుర్కొన్నారు. కొత్త నథింగ్ ఫోన్ రెండవ యూనిట్‌లో కూడా అదే సమస్యను ఎదుర్కొన్నారు. ఆఫ్‌లైన్ మార్కెట్‌లో కొనుగోలు చేసేందుకు ఈ డివైజ్ పరికరం ఇంకా అందుబాటులోకి రాలేదు. వినియోగదారులు ఆఫ్‌లైన్ స్టోర్‌లలోకి వచ్చే వరకు వేచి ఉండవచ్చు. ఫోన్ సరిగా పనిచేయనప్పుడు కొనుగోలు చేయాలంటే వినియోగదారులు ముందుకు రారు. అందుకే కొన్ని వారాల క్రితమే రిలయన్స్‌తో కంపెనీ చర్చలు జరిపింది. నథింగ్ ఫోన్ (1) త్వరలో రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లలో అందుబాటులోకి రావచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతానికి, ఈ నథింగ్ హ్యాండ్‌సెట్ ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఎప్పుడు సేల్ అందుబాటులోకి వస్తుందే అనేదానిపై కంపెనీ కూడా ధ్రువీకరించలేదు.
ప్రతి 2 నెలలకు 3 ఏళ్ల ఆండ్రాయిడ్ సపోర్ట్, 4 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తామని కంపెనీ నిర్ధారించలేదు. ఈ డివైజ్ తగినంత శక్తివంతమైన మిడ్ రేంజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778+ SoC ద్వారా పనిచేస్తుంది. హ్యాండ్‌సెట్ 60Hz నుంచి 120hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల ఫ్లెక్సిబుల్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ వెనుక HDR10+ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 సపోర్టును కలిగి ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4500mAh బ్యాటరీతో సపోర్టు అందిస్తుంది. కానీ, రిటైల్ బాక్స్ ఛార్జర్ లేదా కేసుతో రాకపోవచ్చు. టైప్ C కేబుల్ కూడా లేదని నివేదిక తెలిపింది.