Nabard : నాబార్డులో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్
- Guntupalli Ramakrishna
- Published On : July 29, 2021 / 03:09 PM IST
Job Notification 2021
Nabard : నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్( నాబార్డు)లో ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్ జారీ అయింది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ అసిస్టెంట్ మేనేజర్ ఈ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 153. ఈ పోస్టులన్నీ గ్రేడ్ ఎ కేటగిరికి చెందినవి.
ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవలనుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్ధి వయస్సు 2021 జులై 1 నాటికి 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఎంపిక ప్రక్రియ విషయానికి వస్తే పరీక్ష అధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ముందు ప్రాధమిక పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన అభ్యర్ధలకు ప్రధాన పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ప్రధాన పరీక్షకు, 1.25 మరియు ఇంటర్వ్యూకు 1.3 నిష్ఫత్తుల్లో పిలుస్తారు.
పరీక్ష ఫీజు విషయానికి వస్తే ఎస్సీ,ఎస్టీ,పిడబ్ల్యుబిడి కేటగిరి అభ్యర్ధులు 150 రూపాయలు, ఇతర అన్ని వర్గాల వారు 800 రూపాయలు పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ధరఖాస్తులు ఆన్ లైన్ ద్వారా స్వీకరిస్తారు. ధరఖాస్తు గడువు ఆగస్టు 7వతేదితో ముగుస్తుంది. వివరాలకు నాబార్డు అధికారిక వెబ్ సైట్ nabard.org
