చెట్లపై నరేంద్ర చిత్రం, అందుకే చెక్కానంటున్న కళాకారుడు

  • Publish Date - December 12, 2020 / 01:36 PM IST

Odisha artist carves PM Modi’s portrait : ఒడిశా రాష్ట్రానికి చెందిన కళాకారుడు విభిన్నంగా చిత్రాలను చెక్కాడు. ఓ చెట్టుపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫొటోను చెక్కిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. Mayurbhanj ప్రాంతంలో ఉన్న Similipal National Parkలో Behera అనే కళాకారుడు ఈ చిత్రాలను చెక్కాడు. ఇతను Mayurbhanj జిల్లాకు చెందిన వాడు. చెట్లపై ఉన్న ప్రేమతో ఇలా చేయడం జరిగిందన్నారు. తాను Mayurbhanj ప్రాంతానికి చెందిన చిన్న కళాకారుడినని, తాను ప్రధానిని వ్యక్తిగతంగా కలువలేనని తనకు తెలుసని అన్నారు.

అడవిలో అక్రమంగా చెట్లను నరకడం ఆపాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కొరుతున్నట్లు కళాకారుడు వెల్లడించారు. దేశ అభివృద్ధి, తదితర పనులపై నిర్ణయాలు తీసుకుంటున్న మోడీకి కృతజ్ఞతలు తెలియచేస్తున్నానన్నారు. పర్యావరణాన్ని ప్రతీ ఒక్కరూ కాపాడేందుకు సందేశం ఇవ్వాలనే ప్రయత్నంలో భాగంగా ఇలా చేయడం జరిగిందన్నారు. ఇతను అడవిలో ఉన్న చెట్లపై అనేక చిత్రాలు చెక్కారు. పీఎం మోడీ, ఆయన తల్లి జన్మదినం సందర్భంగా.. Sachin Sanghe బెంగళూరు శిల్పకారుడు..వినూత్న కానుకను అందచేసిన సంగతి తెలిసిందే. చాక్ పీస్‌లో ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన తల్లి హీరాబెన్ మోడీ ఉన్నట్లు కళాకృతిని రూపొందించారు. దీనిని ఆన్ లైన్‌లో చూసిన మోడీ..సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు