Cobra Stuck in Beer Can: బీర్‌ క్యాన్‌లో దూరిన నాగుపాము..కిక్ రాలేదుగానీ.. చుక్కలు కనిపించాయి..

ఓ భారీ నాగుపాము ఓ బీర్‌ క్యాన్‌లో దూరింది. పాపం దాంట్లోంచి బయటకు రాలేక నానా అవస్థలు పడింది.

Cobra Stuck in Beer Can : ఓ భారీ నాగుపాము ఓ బీర్‌ క్యాన్‌లో దూరింది. పాపం జనాలకే కాదు నాకు కూడా కిక్ కావాలనుకుందో ఏమోగానీ..బీరు క్యాన్ లోకి దూరింది. ఆ తరువాత పాపం బయటకు రాలేక నానా అవస్థలు పడింది. ఆ క్యాన్ నుంచి బయటపడటానికి ఎన్ని రకాలుగానే యత్నాలు చేసింది. కానీ పాపం ఫలించలేదు. పాము పడుతున్న తిప్పల్ని గమనించిన స్థానికులు దానికి విముక్తి కల్పించారు.

పూరీ జిల్లా బొలొంగొ ప్రాంతంలోని జితేంద్ర మహాపాత్రొ పెరటిలో గురువారం (డిసెంబర్ 2,2021)న ఓ నాగుపాము ఓ బీర్ క్యాన్ లోకి దూరి బయటకు రాలేక పడుతున్న బాధలు చూసిన స్థానికులు అయ్యో..పాపం అనుకున్నారు.
దాంట్లోంచి బయటపడలేక పాము విలవిలలాడటం చూసి స్నేక్‌ హెల్ప్‌లైన్‌ కు ఫోన్ చేశారు.

దీంతో స్నేక్ హెల్ప్‌లైన్‌ సభ్యుడు సుశాంత కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. చాకచక్యంగా పాముకు గాయాలు కాకుండా..జాగ్రత్తగా క్యాన్ నుంచి పాముని బయటకు తీసి..మయూర్‌భంజ్‌లోని బరిపడ అటవీ ప్రాంతంలో వదిలారు. దాంతో సదరు నాగుపాము బతుకు జీవుడా? మనుషుల్లాగా మనకెందుకు ఈ కిక్కులు అనుకంటూ జరజరా పాక్కుంటు వెళ్లిపోయింది.

కాగా ఎవరో మందుబాబులు తాగి పారేసిన బీరు క్యాన్ లోకి దూరింది ఆ పాము. మద్యం తాగి క్యానును..ఆహార పదార్ధాలు, ప్యాకెట్లు పడి ఉన్నాయి. ఈక్రమంలో అటుగా వచ్చిన ఆ పాము ఆ బీరు క్యాన్ లోకి దూరి నానా అవస్థలు పడింది.మనుషుల నిర్లక్ష్యానికి ఎన్నో జీవులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ పాము విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఆ పాముకి ఇంకా జీవించే రోజులు ఉన్నాయి అందుకే ప్రాణాలతో బయటపడింది.

ట్రెండింగ్ వార్తలు