Ajit Pawar visits uncle Sharad : శరద్ పవార్‌కు అజిత్ పవార్ పరామర్శ

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ శుక్రవారం రాత్రి తన మామ అయిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిశారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తన మంత్రివర్గాన్ని విస్తరించిన కొద్ది గంటల తర్వాత అజిత్ పవార్ కీలకమైన ఆర్థికశాఖ అమాత్య పదవిని స్వీకరించాక ముంబయిలోని సిల్వర్ ఓక్ లోని శరద్ పవార్ నివాస గృహానికి వచ్చి పరామర్శించారు....

Ajit Pawar visits uncle Sharad

Ajit Pawar visits uncle Sharad : మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ శుక్రవారం రాత్రి తన మామ అయిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిశారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తన మంత్రివర్గాన్ని విస్తరించిన కొద్ది గంటల తర్వాత అజిత్ పవార్ కీలకమైన ఆర్థికశాఖ అమాత్య పదవిని స్వీకరించాక ముంబయిలోని సిల్వర్ ఓక్ లోని శరద్ పవార్ నివాస గృహానికి వచ్చి పరామర్శించారు. శరద్ పవార్ భార్య ప్రతిభకు శస్త్రచికిత్స జరిగిన తర్వాత అజిత్ పవార్ ఇంటికి వచ్చారు. (Ajit Pawar visits uncle Sharad)

Ranjit Singh became Saddam Sheikh : అల్ ఖైదాలో చేరిన రంజిత్ సింగ్ సద్దాం షేక్‌గా మారినవేళ…

ఉప ముఖ్యమంత్రిగా చేరిన తిరుగుబాటు నేత అజిత్ పవార్ శరద్ పవార్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది. (Maharashtra Cabinet reshuffle) శరద్ పవార్ భార్య ప్రతిభ శుక్రవారం శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అజిత్ పవార్ శిబిరంలో భాగమైన మహారాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్‌బల్ గతంలో ప్రతిభా పవార్‌ ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.

Triple Talaq :యూపీలో దారుణం… నిఖా అయిన రెండు గంటలకే ట్రిపుల్ తలాఖ్

‘‘ ప్రతిభా పవార్ త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను, ఆమె క్షేమంగా ఉండాలని దేవుడిని కోరుతున్నాను’’ అని ఛగన్ భుజబల్ అన్నారు. తిరుగుబాటు తర్వాత శరద్ పవార్, అతని మేనల్లుడు అజిత్ మధ్య జరిగిన మొదటి సమావేశం ఇది. అజిత్ పవార్ 8 మంది ఎన్‌సిపి ఎమ్మెల్యేలతో కలిసి జులై 2న మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారు. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది.