World Environment Day 2023 : ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కొత్త థీమ్

ఏటా జూన్ 5 న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది ప్లాస్టిక్ వాడకంపై పోరాటం చేసేందుకు ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. ప్రతి ఒక్కరూ ఓ ఉద్యమంలా పాల్గొనాలని కోరింది. ట్విట్టర్‌లో పలువురు అవగాహన కల్పిస్తూ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.

World Environment Day : ప్రస్తుతం ప్రపంచాన్ని ప్లాస్టిక్ భూతం పట్టి పీడిస్తోంది. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బ తింటోంది. నీరు, మట్టిని కలుషితం చేస్తూ మనుషులు, జంతువుల అనారోగ్యాలకు కారణం అవుతోంది. ఎంతో ముప్పు తెచ్చిపెడుతున్న ప్లాస్టిక్ వాడకం వద్దంటూ ఎన్నో అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా ఈ పొల్యూషన్‌కి అడ్డుకట్ట పడట్లేదు. జూన్ 5 ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’. ఈ సంవత్సరం ప్లాస్టిక్ కాలుష్యానికి పరిష్కార మార్గాలపై కొత్త థీమ్‌ను తీసుకున్నారు.

Pawan Kalyan: పర్యావరణంపై వైసీపీ ప్రభుత్వానికి ఉన్నట్టుండి ప్రేమేందుకో.. వరుస ట్వీట్లలో ప్రశ్నించిన పవన్ కల్యాణ్

ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్లాస్టిక్ కాలుష్యం మనుషుల మనుగడకి పెను సవాలుగా మారింది. ఏటా ప్రపంచ వ్యాప్తంగా 400 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోంది. అందులో పది శాతం రీసైకిల్ చేస్తే 19 నుంచి 23 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ సరస్సులు, నదులు, మహా సముద్రాల్లోకి వెళ్తోంది. అంటే 2,200 ఈఫిల్ టవర్ల బరువుతో సమానం అన్నమాట. ఇంత కాలుష్యం నీటిలో నివసించే జంతువుల మనుగడకు ఎంత హానికారమో అర్ధం చేసుకోవచ్చు.

 

ప్లాస్టిక్ సంచులు డ్రైనేజ్‌లోకి వెళ్తే డ్రైనేజీ సిస్టమ్‌ను నాశనం చేస్తాయి. అపరిశుభ్రమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. దాంతో ప్రజలు రకరకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. రంగు రంగుల ప్లాస్టిక్ సంచులు మట్టిని.. నీటిని కలుషితం చేస్తాయి. ఎన్నో అనర్థాలకు కారణం అవుతున్న ప్లాస్టిక్ వాడకం నిషేధించడానికి ఈ సంవత్సరం ‘బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్’ అనే హ్యాష్ టాగ్‌తో ట్విట్టర్‌లో ప్రచారం జరుగుతోంది.

షూటింగ్ స్పాట్ లో పర్యావరణంపై బన్నీ రిక్వెస్ట్

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘మంచి భవిష్యత్తు కోసం మాట్లాడండి’ అని పిలుపునిస్తూ ఐక్యరాజ్యసమితి #BeatPlasticPollution అనే హ్యాష్ ట్యాగ్‌తో మిలియన్ల మంది పోరాటంలో పాల్గొనమంటూ కోరింది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి అరెకా నట్ ప్లేట్లు వాడాలంటూ IFS అధికారి పర్వీన్ కస్వాన్ పిలుపునిచ్చారు. ఓ అటవీ గ్రామంలో ఏర్పాటు చేసిన అరెకా నట్ ప్లేట్ల ప్లాంటుకి సంబంధించిన వీడియోను ఆయన షేర్ చేశారు.

 

మంచి భవిష్యత్తు కోసం మొక్కలు నాటాలని పర్యావరణ కార్యకర్త లిసిప్రియ కంగుజం కోరారు. షాజహాన్‌పూర్ పోలీసులు మన భూమిని పచ్చగా, కాలుష్య రహితంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేశారు. ప్లాస్టిక్ వాడకం వల్ల అటు పర్యావరణానికి ఇటు మనుషుల ప్రమాదం పొంచి ఉంది. ఇక మనుష్యులు వాడి పడేసే ప్లాస్టిక్ వ్యర్ధాల వల్ల మూగజీవాలకు కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. భవిష్యత్‌లో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ ప్రతిన ప్లాస్టిక్ వాడకం మానేస్తామని ప్రతిన పూనాల్సిందే.

 

ట్రెండింగ్ వార్తలు