×
Ad

World Environment Day : ‘ప్రకృతి మన కోసం ఎంతో చేస్తుంది’..

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఇంటి ప్రాంగణంలో మొక్కలు నాటారు..

  • Published On : June 5, 2021 / 12:49 PM IST

World Environment Day

World Environment Day: నేడు (జూన్ 5) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఇంటి ప్రాంగణంలో మొక్కలు నాటారు. ‘‘ప్రకృతి మన కోసం ఎంతో చేస్తుంది.. మనం కూడా మొక్కలు నాటి, తరువాత తరాలకు పచ్చటి వాతావరణాన్ని ఇస్తామని అందరం ప్రతిజ్ఞ చేద్దాం’’.. అంటూ మొక్కలు నాటుతున్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు బన్నీ..

World Environment Day సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు. ‘‘మరింత ఆందోళన అంచున ఉన్న పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడానికి ప్రతిజ్ఞ.. మన ప్లానెట్‌ను పచ్చగా మార్చడానికి ప్రయత్నిద్దాం!’’ అని పేర్కొన్నారు..

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు నేచర్‌కి సంబంధించి బ్యూటిఫుల్ వీడియో షేర్ చేశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు World Environment Day సందర్భంగా ప్రకృతి యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు..