Giriraj
population: దేశంలో జనాభా ‘సురస’ రాక్షసి నోటిలా పెరిగిపోతోందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. రామాయణంలో సీతను వెతుక్కుంటూ హనుమంతుడు వెళ్తుండగా సముద్రంలో సురస అనే రాక్షసి తన నోటిని తెరుస్తుంది. దాని నోట్లోకి వెళ్ళి మరీ హనుమంతుడు తప్పించుకుంటాడు. ఆ రాక్షసి నోరు అతి పెద్దగా ఉంటుంది. దేశ జనాభాను పోల్చే క్రమంలో గిరిరాజ్ సింగ్ సురస నోటిని గుర్తు చేశారు.
AIADMK: ఏఐఏడీఎంకే నుంచి పన్నీర్ సెల్వం తొలగింపు.. చెన్నైలో 144 సెక్షన్
తాజాగా, ఆయన దేశ జనాభాపై మాట్లాడుతూ… దేశంలో వనరులు పరిమితంగా ఉన్నాయని, మన జనాభానేమో సురస నోటిలా పెరిగిపోతోందని చెప్పారు. ఒక్కొక్కరు 10 మంది పిల్లలను కనాలన్న దిక్కుమాలిన మనస్తత్వం ఉండొద్దని చెప్పారు. కఠినమైన జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి, దేశంలోని అన్ని మతాలవారి విషయంలోనూ అమలు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంటు నుంచి అన్ని వీధుల వరకు ఇటువంటి డిమాండ్ రావాలని ఆయన చెప్పారు. కాగా, భారత జనాభా వచ్చే ఏడాది చైనా జనాభాను దాటనుందని ఐక్య రాజ్యసమితి ఓ నివేదికలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో గిరిరాజ్ సింగ్ జనాభాకు సంబంధించి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.