×
Ad

mid-air SpiceJet flight : గాల్లో విమానం.. ఎమర్జెన్సీ డోర్ తెరవబోయాడు.. అంతే..

ప్రయాణ సమయంలో చాలామందికి విండో సీటు అంటే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అక్కడే కూర్చొనేందుకు ఆరాటపడుతుంటారు. రిజర్వేషన్ కూడా విండో సీటు వచ్చేలా బుకింగ్ చేసుకుంటుంటారు. ఎందుకంటే..

  • Published On : March 29, 2021 / 04:05 PM IST

Passenger On Spicejet Flight Tries To Open Emergency Door Mid Air (1)

SpiceJet flight : ప్రయాణ సమయంలో చాలామందికి విండో సీటు అంటే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అక్కడే కూర్చొనేందుకు ఆరాటపడుతుంటారు. రిజర్వేషన్ కూడా విండో సీటు వచ్చేలా బుకింగ్ చేసుకుంటుంటారు. ఎందుకంటే.. జర్నీ బోర్ కొట్టకుండా బయట చూస్తుండొచ్చు కదా.. అది ఏ బస్సో.. లేదా రైలో.. కారు వంటి వాహనాలైతే పర్వాలేదు.. కానీ, ఓ తుంటరి వ్యక్తి.. ఏకంగా విమానంలో నుంచి బయటకు చూడాలనుకున్నాడు. ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు.

అంతే.. విమానంలో ప్రయాణికులంతా హడలిపోయారు. విమాన సిబ్బంది అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. గాల్లో విమానం ఉన్నప్పుడు అతడు డోర్ తెరిచి చూడాలనుకున్నాడో లేదో అంత ఎత్తు నుంచి కిందికి దూకాలనుకున్నాడో తెలియదు కానీ, అతడి చేసిన పనికి అందరిని హడలెత్తించాడు. ఢిల్లీ-వారణాసి స్పైస్ జెట్ ఫ్లయిట్ లో ఈ ఘటన జరిగింది. ఢిల్లీకి చెందిన ఓ ప్రయాణికుడు చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు.

విమాన సిబ్బంది చెప్పినా వినలేదు.. దురుసుగా ప్రవర్తించాడు.. మాట వినకుండా ఎమర్జెన్సీ డోర్ తెరవబోయాడు.. అంతే.. సిబ్బంది, ప్రయాణికులు అతడ్ని వెనక్కి లాగేశారు. వెంటనే సిబ్బంది పైలెట్‌‌ కు సమాచారం అందించారు. సదరు పైలెట్‌‌ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌ చేసేందుకు ఏటీసీ (ఎయిర్‌ ట్రాఫిక్‌‌ కంట్రోల్) సిగ్నల్ ఇచ్చాడు. అనుమతి రావడంతో వెంటనే వారణాసిలో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఆ ప్రయాణీకుడిని సీఐఎస్ఎఫ్, స్పైస్‌ జెట్‌ సిబ్బంది సహాయంతో స్థానిక పోలీసులకు అప్పగించారు.