Bidar-Yeswantpur Express : బీదర్-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుల పరిస్థితి ఘోరం.. స్లీపర్ కోచ్ ఫ్లోర్‌పై నిద్రిస్తున్న జనం..

బీదర్-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ రావాల్సిన సమయానికి మూడు గంటలు ఆలస్యంగా వచ్చింది. క్రిక్కిరిసిన ప్రయాణికులు సాధారణ కోచ్ దాటి స్లీపర్ కోచ్‌లోకి వచ్చారు. కోచ్ ఫ్లోర్‌పై పడుకుని నిద్రించారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Passengers sleeping on the coach floor

Passengers sleeping on the coach floor : బీదర్-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. స్లీపర్ కోచ్ నేల మీద ప్రయాణికులు నిద్రపోతూ ఇబ్బంది పడుతున్న ఫోటో ఒకటి ట్విట్టర్‌లో షేర్ అయ్యింది. ఈ ఫోటో చూసిన రైల్వే శాఖ స్పందించింది.

Woman CTI Rosaline Arokia Mary : టికెట్ లేకపోతే చుక్కలే .. రూ.కోటి వసూలు చేసిన మహిళా టీసీ, రైల్వే శాఖ ప్రశంసలు

జనరల్ కోచ్‌లు నిండిపోయాకా ప్రయాణికులు స్లీపర్ కోచ్‌కు వెళ్తారు. అయితే బీదర్-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్ కోచ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. అడుగు వేయడానికి ఖాళీ లేనంతగా ప్రయాణికులు క్రిక్కిరిసిపోయారు. కోచ్ నేలపై నిద్రించారు. రావాల్సిన సమయానికి మూడు గంటలు ఆలస్యంగా రైలు బెంగళూరులోని యశ్వంత్‌పూర్‌కి వచ్చింది.

 

ఇక దీనికి సంబంధించిన ఫోటోను రమేష్ అనే ట్విటర్ యూజర్ షేర్ చేసాడు. ‘నిన్న బీదర్ – YPR రైలులో ఇది పరిస్థితి. స్లీపర్ కోచ్‌లో సాధారణ టిక్కెట్టు తీసుకున్న ప్రయాణికులంతా ఎక్కారు. 7.40కి రావాల్సిన రైలు 10.30 గంటలకు వచ్చింది. 1000 మంది ప్రయాణికులకు ఆలస్యమైంది. రోజురోజుకి ఈ సమస్యలు పెరిగిపోతున్నాయి. దీనిపై కాస్త దృష్టి సారించండి’ అంటూ రైల్వే శాఖను,  రైల్వే మంత్రిని ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు.

Sonu sood: సోనూ సూద్ చేసిన ఆ పనికి మండిపడ్డ రైల్వే శాఖ

రైళ్లలో స్లీపర్, జనరల్ కోచ్‌ల సంఖ్యను కూడా పెంచాలని .. బీదర్‌కు కొత్తరైలు వేయాలని రమేష్ రైల్వే అధికారులను కోరాడు. ఇతని పోస్ట్ వైరల్ కాగానే అనేకమంది అతనిని సపోర్ట్ చేస్తూ వ్యాఖ్యలు చేసారు. రైల్వే సేవా విభాగం కూడా రమేష్ ట్వీట్‌కి స్పందించింది. PNR వివరాలను పంచుకోమంటూ రమేష్‌కి తెలిపింది. రైల్వే అధికారులు ప్రయాణికుల ఇబ్బందులు తీర్చడంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.