పవన్, అలీ ఆఫ్‌స్క్రీన్ అనుబంధం..
- sekhar
- Published On : February 21, 2021 / 08:55 PM IST
Pawan Kalyan – Ali: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, కామెడీ కింగ్ అలీ లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. చాలా రోజుల తర్వాత వీరిద్దరు కలవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. పవన్ ప్రతి సినిమాలోనూ అలీ ఉండేవాడు. పలు ఫంక్షన్లలోనూ పవన్ పక్కన కనిపించే వాడు.. అలీ పక్కన ఉంటే ధైర్యంగా ఉంటుంది అని పవన్ చాలా సార్లు చెప్పారు.
అయితే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పవన్, అలీ మధ్య రాజకీయ పరమైన విభేదాలు తలెత్తాయి. కొద్ది కాలం ఒకరికొకరు దూరమయ్యారు. అయితే తాజాగా వీరిద్దరూ అలీ తమ్ముడు ఖయ్యూమ్ బావ పెళ్లి రిసెప్షన్ వేడుకలో కలిశారు. అలీ ఆహ్వానం మేరకు పవర్‌స్టార్ ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు.
వీరిద్దరూ కాసేపు నవ్వుతూ మాట్లాడుకున్నారు. వీరి చిట్ చాట్‌ని అలీ భార్య జుబేదా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతున్నాయి.
