Pawan Kalyan : మొదలైన హరిహర వీరమల్లు.. ఈ సారైనా ఆగకుండా సాగుతుందా..

 పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక ఎన్ని సినిమాలు చేస్తున్నా అన్నింటికన్నా జనాలు ఇంట్రస్ట్ చూపిస్తోంది మాత్రం హరిహరవీరమల్లు మీదే. కానీ ఈ సినిమా మాత్రం ఆడియన్స్ పేషెన్స్ ని టెస్ట్ చేస్తోంది. రెండేళ్ల క్రితం స్టార్ట్ అయిన...........

Pawan Kalyan :  పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక ఎన్ని సినిమాలు చేస్తున్నా అన్నింటికన్నా జనాలు ఇంట్రస్ట్ చూపిస్తోంది మాత్రం హరిహరవీరమల్లు మీదే. కానీ ఈ సినిమా మాత్రం ఆడియన్స్ పేషెన్స్ ని టెస్ట్ చేస్తోంది. రెండేళ్ల క్రితం స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ సగంలో సగం కూడా కంప్లీట్ కాలేదు. రకరకాల రీజన్స్ తో ఈ హిస్టారికల్ డ్రామా మాత్రం పోస్ట్ పోన్ అవుతూ ఆగిపోతూనే ఉంది. ఎన్ని సార్లు పోస్ట్ పోన్ అయినా ఈసారి టార్గెట్ మిస్ అయ్యేదే లేదంటోంది టీమ్.

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు పవన్ కెరీర్ లోనే 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబందించి ఆగుతూ, సాగుతూ… షూటింగ్ కంటిన్యూ అవుతోంది. మొన్నటి వరకూ అసలు సినిమా షూటింగ్ గురించి అప్ డేట్స్ ఇవ్వని టీమ్ లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబందించి యాక్షన్ షూట్ జరుగుతోందని పోస్ట్ చేశారు హరీష్ శంకర్.

ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుగుతుంది. షూట్ సెట్స్ కి వెళ్లిన హరీష్ శంకర్ డైరెక్టర్ క్రిష్ ఫోటో తీసి తన సోషల్ మీడియాలో షేర్ చేసి హరిహర వీరమల్లు మొదలైంది సినిమా కోసం ఎదురు చూస్తున్నాం అంటూ పోస్ట్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇటీవల మొదలవుతుందనుకున్న హరిహరవీరమల్లు పవన్ విశాఖ ఘటనతో ఆగిపోవడంతో అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. మళ్ళీ ఇప్పుడు షూట్ మొదలైందని తెలియడంతో ఈ సారైనా షూట్ ఆపకుండా కంటిన్యూగా చేయాలని ఆశిస్తున్నారు పవన్ ఫ్యాన్స్. మరోపక్క క్రిష్ కూడా ఈ సినిమాని త్వరగా పూర్తిచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మర్ కి రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు.

Jailer : సూపర్ స్టార్‌కి తోడు మరో స్టార్ హీరో.. ‘జైలర్’తో వెండితెరపై విధ్వంసమే..

అయితే పవన్ పాలిటిక్స్ ప్రతిసారి ఈ సినిమాకి గ్యాప్ ఇస్తున్నాయి. లేకపోతే ఇప్పుటికే హరిహరవీరమల్లు సినిమా వచ్చేసేది. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కాబట్టి ప్రతీ చిన్న డీటెయిల్ ని చూసుకుంటున్నారు చిత్ర యూనిట్. పవన్ ఫైట్స్ కోసం స్పెషల్ ట్రెయినింగ్ సెషన్ తీసుకున్నారు. ఇప్పటికే ఫైట్స్ కోసం ఇండోర్ సెట్ లో రిహార్సల్స్, వర్క్ షాప్ చేసిన టీమ్ భారీ యాక్షన్ షెడ్యూల్ ని ఫిల్మ్ సిటీలో స్టార్ట్ చేశారు. రెండేళ్ల నుంచి తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు సినిమా కంప్లీట్ అయ్యేవరకూ పవన్ ని వదిలేదే లేదంటున్నారు మేకర్స్. ఇప్పటి వరకూ ఎప్పుడూ టచ్ చెయ్యని ఫోక్ జానర్ లో సరికొత్త లుక్ లో కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. మరి ఈ సారైనా షూటింగ్ ఆగకుండా జరిగి సమ్మర్ కి సినిమా రిలీజ్ చేస్తారేమో చూడాలి.

 

ట్రెండింగ్ వార్తలు