Pawan Kalyan: వైరల్‌గా మారిన పవన్ సరికొత్త లుక్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ మూవీ భీమ్లా నాయక్ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాకు ప్రేక్షకులు.....

Pawan Kalyan Latest Look From Hari Hara Veera Mallu Sets Goes Viral

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ మూవీ భీమ్లా నాయక్ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాకు ప్రేక్షకులు పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడంతో పవన్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ హిట్‌గా ఈ సినిమా నిలిచింది. ఇక ఈ సినిమా సక్సెస్ కావడంతో పవన్ తన నెక్ట్స్ మూవీలపై ఫోకస్ పెట్టాడు. అటు రాజకీయంగా కూడా బిజీగా ఉంటున్న పవన్, తాజాగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు చిత్ర షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని చూస్తున్నాడు.

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’లో పవన్ జాయిన్ అయ్యేది అప్పుడే!

ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకోగా.. ఈ సినిమా షూటింగ్‌ను ఏప్రిల్ 8 నుండి తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే పవన్ ఈ సినిమా షూటింగ్‌లో ఆలస్యంగా జాయిన్ అవుతారని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ కేవలం రూమర్లేనని తెలుస్తోంది. తాజాగా హరిహర వీరమల్లు సెట్స్‌లో పవన్ కళ్యాణ్ కనిపించడంతో ఈ సినిమా షూటింగ్‌లో ఆయన అనుకున్న సమయానికంటే ముందుగానే జాయిన్ అవుతున్నట్లు తేలిపోయింది.

Pawan Kalyan Latest Look From Hari Hara Veera Mallu Sets Goes Viral

కాగా తాజాగా ఆయన ఈ సినిమా సెట్స్‌లో చాలా స్టిఫ్ లుక్‌లో కనిపించడంతో దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోల్లో పవన్ ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం రెడీ అవుతున్నట్లుగా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాను పీరియాడికల్ మూవీగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా చిత్రంగా ఈ సినిమా రాబోతుంది. ఈ చిత్రంలో రాబిన్‌హుడ్ తరహా పాత్రలో పవన్ కనిపిస్తాడని చిత్ర వర్గాలు అంటున్నాయి.

Pawan Kalyan Latest Look From Hari Hara Veera Mallu Sets Goes Viral

పవన్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్న ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏఎం.రత్నం ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Pawan Kalyan Latest Look From Hari Hara Veera Mallu Sets Goes Viral