షూటింగ్‌లో పవన్ కళ్యాణ్.. ఫోటోలు లీక్..
- vamsi
- Published On : March 5, 2021 / 01:45 PM IST
Pawan Kalyan Photos Leaked:ఇటీవలికాలంలో సినిమా షూటింగ్‌లలో ఫోటోలు లీక్ అవ్వడం నిర్మాతలను కలవరానికి గురిచేస్తోండగా.. ఇటీవల ఆర్ఆర్ఆర్ ఫోటోలు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్.. అయ్యప్పన్ రీమేక్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
ఎడిటింగ్ సమయంలో ఎక్కువగా ఫోటోలు లీక్ అవుతుండగా.. సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో తిరుగుతున్నాయి. త్రివిక్రమ్ ఈ సినిమాకు మాటలు అందిస్తోండగా.. హైదరాబాద్ శివార్లలో వేసిన సెట్‌లో మూవీ చిత్రీకరణ జరుగుతోంది. సెట్ నుండి ఫొటో లీకైంది.
ఇందులో పవన్ వెనుక పోలీసులు లాఠీలు పట్టుకొని కనిపిస్తున్నారు. మరో ఫోటోలో పవన్ కల్యాణ్ గొడపై నుంచి దూకుతున్నట్లు కనిపించాడు.
