Hari Hara Veera Mallu : డెడికేషన్ అంటే ఇదీ.. ‘హరి హర వీరమల్లు’ కోసం పవన్ ప్రాక్టీస్..

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ ‌క‌ళ్యాణ్ 27వ సినిమా ‘హరి హర వీరమల్లు’ (Legendary Heroic Outlaw) క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది.. మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎ.ఎం.ర‌త్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Hari Hara

Hari Hara Veera Mallu: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ ‌క‌ళ్యాణ్ 27వ సినిమా ‘హరి హర వీరమల్లు’ (Legendary Heroic Outlaw) క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది.. మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎ.ఎం.ర‌త్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ వీడియోకి రెస్పాన్స్ బాగుంది. పవన్ గెటప్, కాస్ట్యూమ్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్‌కి బాగా కేర్ తీసుకుంటున్నారు. ఇంతకుముందు సినిమాలకు ఆయన ఎంతలా కష్టపడ్డారో తెలిసిందే. ‘హరి హర వీరమల్లు’ లోని యాక్షన్ సీక్వెన్స్ కోసం ట్రైనర్ సహాయంతో ట్రైనింగ్ అవుతున్న పవన్ పిక్స్ యూనిట్ శుక్రవారం షేర్ చేసింది.

Sham Kaushal : పవర్‌స్టార్ గుర్రం సీన్స్ గూస్ బంప్స్ అంటున్న టీం..

యూనిట్ సమాచారం ప్రకారం పవన్ ఈ సినిమాలో హార్స్ రైడింగ్ సీన్స్‌లో అదరగొట్టేశారట. ‘బద్రి’ లో చికితా సాంగ్‌తో స్టార్ట్ చేస్తే ‘గబ్బర్ సింగ్’ నుండి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వరకు పవన్ గుర్రం ఎక్కితే ఆ సందడి ఎలా ఉంటుందో తెలిసిందే. ‘హరి హర వీరమల్లు’ లో గుర్రం సీన్స్ గూస్ బంప్స్ అనే రేంజ్‌లో ఉంటాయని చెప్తున్నారు. పవర్‌స్టార్ కెరీర్‌లో మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా స్థాయిలో హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో 2022 సంక్రాంతికి ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కానుంది.