Sham Kaushal : పవర్‌స్టార్ గుర్రం సీన్స్ గూస్ బంప్స్ అంటున్న టీం..

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో.. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అగ్ర నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మూవీ.. ‘హరి హర వీరమల్లు’.. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ అండ్ గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Sham Kaushal : పవర్‌స్టార్ గుర్రం సీన్స్ గూస్ బంప్స్ అంటున్న టీం..

Sham Kaushal

Sham Kaushal: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో.. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అగ్ర నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మూవీ.. ‘హరి హర వీరమల్లు’.. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ అండ్ గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పవర్‌‌స్టార్ నటిస్తున్న 27వ సినిమా ఇది. ఈ సినిమాలో పవన్ వజ్రాల దొంగ ‘హరి హర వీరమల్లు’ పాత్రలో సరికొత్త గెటప్‌లో కనిపించనున్నారు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ మహారాణి పాత్రలో కనిపించనుంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన మేజర్ యాక్షన్ పార్ట్ షూట్ కంప్లీట్ చేశారు.

‘హరి హర వీరమల్లు’ గా పవర్‌స్టార్.. వైరల్ అవుతున్న పిక్..

 

ఈ యాక్షన్ ఎపిసోడ్ పాపులర్ బాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ శ్యామ్ కౌషల్ నేతృత్వంలో అత్యంత భారీగా చిత్రీకరించారు. శ్యామ్ హిందీలో పలు సినిమాలకు యాక్షన్ డైరెక్టర్‌గా పని చేశారు. ‘క్రిష్’, ‘దంగల్’, ‘గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్’, ‘గూండే’, ‘బాజీరావ్ మస్తానీ’ వంటి సినిమాలకు ఫిలింఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. పవన్, క్రిష్ సినిమాకు పనిచెయ్యడం పట్ల చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు శ్యామ్. ‘దేవుడి దయవల్ల సూపర్ టాలెంటెడ్, నైస్ హ్యూమన్ బీయింగ్ క్రిష్ జాగర్లమూడితో ‘హరి హర వీరమల్లు’ వర్క్ చేశాను. షాట్ బాగా వచ్చిన ప్రతిసారీ నేను, క్రిష్ చిన్నపిల్లల్లా సంతోషపడేవాళ్లం.. సినిమా అండ్ టీం అందరికీ దేవుడి దీవెనలుండాలని కోరుకుంటున్నాను’ అంటూ శ్యామ్ ట్వీట్ చేశారు.

పవర్‌స్టార్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ.. ‘హరి హర వీరమల్లు’..

యూనిట్ సమాచారం ప్రకారం పవన్ ఈ సినిమాలో హార్స్ రైడింగ్ సీన్స్‌లో అదరగొట్టేశారట. ‘బద్రి’ లో చికితా సాంగ్‌తో స్టార్ట్ చేస్తే ‘గబ్బర్ సింగ్’ నుండి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వరకు పవన్ గుర్రం ఎక్కితే ఆ సందడి ఎలా ఉంటుందో తెలిసిందే. ‘హరి హర వీరమల్లు’ లో గుర్రం సీన్స్ గూస్ బంప్స్ అనే రేంజ్‌లో ఉంటాయని చెప్తున్నారు. పవర్‌స్టార్ కెరీర్‌లో మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా స్థాయిలో హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో 2022 సంక్రాంతికి ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కానుంది.