PETROL PRICES INCREASED: మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. పెట్రోల్ పై 45, డీజిల్ పై 43పైసలు పెంపు

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. సోమవారం పెట్రోల్ పై 45 పైసలు, డీజిల్ పై 43 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయించాయి. 14 రోజుల్లో 12 సార్లు ఇంధన ధరలు..

PETROL L PRICES INCREASED: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. సోమవారం పెట్రోల్ పై 45 పైసలు, డీజిల్ పై 43 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయించాయి. 14 రోజుల్లో 12 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. మార్చి 22 నుంచి పెట్రోల్, డీజిల్ పై రూ. 8.45 పెరిగింది. దేశవ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను చూస్తే.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 103.81 కాగా, డీజిల్ 95.07కు చేరింది. ముంబయిలో లీటర్ పెట్రోల్ రూ. 118.13, డీజిల్ రూ. 103.07 కు చేరింది. హైదరాబాద్ లో పెట్రోల్ లీటర్ రూ. 117.68 కు చేరుకోగా, డీజిల్ రూ. 103.75 కు చేరింది.

Petrol, Diesel Prices Today : ఆగని పెట్రో బాదుడు.. గడిచిన 8 రోజుల్లో 7 సార్లు పెరిగిన ఇంధన ధరలు

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో పెట్రలోల్ ధర 44 పైసలు పెరిగి రూ. 119.51కి చేరింది. డీజిల్ ధర రూ. 41 పైసలు పెరిగి రూ. 105.2కు చేరుకుంది. వైజాగ్ లో పెట్రోల్ లీటర్ ధర రూ. 118.23 కు చేరగా, డీజిల్ ధర రూ. 103.95కు చేరింది.విదేశాల నుంచి 85శాతం చమురుని భారత్ దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు పెరగడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గత ఏడాది నవంబర్ 3న కేంద్రం పెట్రోల్‌పై లీటరుకు రూ. 5, డీజిల్‌పై లీటరుకు రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో నవంబర్ 4 నుండి ఇంధన ధరల స్థిరంగా ఉంటూ వచ్చాయి.

Today Petrol Prices : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు…లీటర్‌పై ఎంతంటే?

ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య జరుగుతున్న పోరుతో ఈ ఏడాది మార్చి 22 నుంచి పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి నుంచి ప్రతిరోజూ ఇంధన ధరలు పెరుగుతూనే వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో రాబోయే కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావంతో ఇతర రంగాలపైనా పడుతుంది.

ట్రెండింగ్ వార్తలు